Site icon Prime9

Kannappa: ‘కన్నప్ప’లో మంచు విష్ణు కవలలు – ఆకట్టుకుంటున్న పోస్టర్!

Ariyana-Viviana Look From Kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 24 ఫిలిమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ కాస్ట్‌ భాగమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాతోనే మంచు విష్ణు తనయుడు అవ్‌రామ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అవ్‌రాం ఓ కీ రోల్లో అలరించబోతున్నాడు.

తాజాగా ఈ సినిమాలో మరో స్పెషల్‌ పర్సన్స్‌ కూడా భాగమయ్యారు. వారే మంచు విష్ణు కవల పిల్లలు అవియానా, వివియానా. కన్నప్పలో వీరిద్దరు కూడా నటించబోతున్నాడు. డిసెంబర్‌ 2న వారి బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇందులో వీరిద్దరు డ్యాన్స్‌ చేస్తున్నట్టు కనిపించారు. వీరి లుక్‌కి సంబంధించిన పోస్టర్‌ని మంచు విష్ణు షేర్‌ చేస్తూ అందరికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

“నా మనసు గర్వంతో ఉప్పొంగుతుంది. ఎందుకుంటే అవియానా, వివియానా కన్నప్పలో నటిస్తున్నారనే విషయాన్ని మీతో పంచుకోవడం నాకు గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరు స్క్రీన్‌పై వారి మ్యాజిక్‌ చూసేవరకు వేచి ఉండలేకపోతున్నారు. మై లిటిల్‌ మమ్మీస్‌ ఆన్‌స్క్రీన్‌పై మెరవబోతున్నారు. హ్యాపీ బర్త్‌డే అవి-వివి. ఐ లవ్‌ యూ” అంటూ మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కన్నప్పలోని వారి లుక్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇవాళ వారి బర్త్‌డే కావడంతో నెటిజన్స్‌, ఫ్యాన్స్‌ నుంచి విషెస్‌ వెల్లువెత్తున్నాయి. ఇక ఈ పోస్టర్‌లో వారిద్దరి లుక్‌ని పరిచయం చేస్తూ ఓ సస్పెన్స్‌ ఇచ్చింది మూవీ టీం. కన్నప్పలో వారు డ్యాన్స్‌ చేస్తారా లేదా పాడుతారా అనేది శివయ్య ఆజ్ఞా” అని పేర్కొన్నారు.

కాగా ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం లండన్‌లో ఓ కీలక సన్నివేశాలకు సంబంధించి చిత్రీకరణ జరుగుతున్నట్టు ఇటీవల స్వయంగా మంచు విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమా పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ కీ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్‌కు సంబంధించిన లుక్‌ లీక్‌ కాగా.. దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కన్నప్పలో వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి పెద్ద పీట వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ డిసెంబర్‌కు విడుదల కావాల్సిన సినిమా ఏప్రిల్‌ 25కి వాయిదా పడింది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మెహన్‌ లాల్‌, మధుబాల, కాజల్‌ అగర్వాల్‌ వంటి తదితర నటీనటులు ముఖ్యపాత్రలు నటిస్తున్నారు. అలాగే మోహన్‌ బాబు కూడా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

Exit mobile version