Site icon Prime9

Sambhal Violence Site: సంభాల్‌లో హింసాకాండ.. పాకిస్తాన్ క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం.. సంభాల్ వెళ్లకుండా రాహుల్, ప్రియాంక అడ్డగింత

Cartridges Of Pakistani Ordnance Factory Found At Sambhal Violence Site: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో హింసాకాండ చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న ప్రాంతంలోనే ఆలయం ఉందని గతంలో హిందూ పిటిషనర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కోర్టు విచారించి సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వే చేస్తున్న సమయంలో కొంతమంది అడ్డుకోవడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి.

తాజాగా, ఈ హింసాకాండలో పాకిస్తాన్‌కు చెందిన క్యాట్రిడ్జ్‌లు గుర్తించారు. నవంబర్ 24న జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్, అమెరికాకు చెందిన క్యాట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి. దీంతో వీటిని ఫోరెన్సిక్ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్యాట్రిడ్జ్‌లు విదేశీ నిధులు, ఆయుధాలతో ఉన్నట్లు తేలింది.

ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో నిందితుల నుంచి క్యాట్రిడ్జ్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని ముద్రించడంతో పలు రకాలు ప్రశ్నలు వస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న క్యాట్రిడ్జ్‌లలో 9మి.మీల మిస్ ఫైర్డ్ షెల్, పీఓఎఫ్ అని రాసి ఉన్న ఓ షెల్ గుర్తించారు. అలాగే అల్లర్లకు ఉపయోగించిన మందు సామగ్రి పాకిస్తాన్‌లో తయారైనట్లు తేలింది. దీంతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు 12 బోర్ షెల్స్, రెండు 32 బోర్ షెల్స్ ఉన్నాయి.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాకం గాంధీలు సంభాల్ వెళ్తుండగా యూపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ఢిల్లీ వెళ్లకుండానే తిరిగి ప్రయాణమయ్యారు. ఘాజీపూర్ దగ్గర కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సంభాల్‌లో ఘర్షణల దృష్ట్యా యూపీ సర్కార్ నిషేధం విధించింది. అయితే ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూపీ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ అగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version