Site icon Prime9

Kakinada: కాకినాడ పోర్టులో మరోసారి తనిఖీలు..షిప్‌లో 38వేల మెట్రిక్ టన్నుల బియ్యం!

Kakinada port 38 thousand metric tons of rice in the ship: కాకినాడ పోర్టులో మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీజ్ చేయించిన షిప్‌లో బుధవారం మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయలుదేరగా తనిఖీలు చేశారు. షిప్‌లో మొత్తం 38వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉండగా.. ఇందులో 680 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది.

ఈ మేరకు రైస్ బుకింగ్‌పై మల్టీ డిసిప్లీనరీ కమిటీ బిల్లులు సేకరిస్తుంది. రేషన్ బియ్యంతో పాటు ఉన్న స్టెల్లా ఎల్ షిప్ పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పోర్టు శాఖ, కస్టమ్స్ అథారిటీ అధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.

గత నెల 27వ తేదీన స్టెల్లా ఎల్ షిప్ లో బియ్యం గుర్తించారు. ఈ నౌక పశ్చిమాఫ్రికాకు బియ్యం సరఫరా చేస్తుంది. తనిఖీలు చేసే సమయానికి బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐదు విభాగాల అధికారులు లోపలికి ప్రవేశించి నమూనాలు సేకరిస్తున్నారు. 38వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కించే సమయంలో ఎంత మేర ఉందనే విషయాలపై తనిఖీలు చేస్తున్నారు. అయితే సాయంత్రం వరకు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపించనున్నారు.

మరోవైపు, ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. పోర్టులకు వెళ్లే బియ్యంపై తనిఖీలు చేయనున్నారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యం విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే విజిలెన్స్, పోలీస్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version