Pushpa 2: ‘పుష్ప 2’ రిలీజ్‌ను నిలివేయండి – బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్‌

  • Written By:
  • Updated On - December 4, 2024 / 01:45 PM IST

BJP MLA Demand Ban Pushpa 2 Movie: మరికొన్ని గంటల్లో పుష్ప 2 థియేటర్లోకి రానుంది. ఈ రోజు రాత్రి నుంచి పెయిడ్‌ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ మేరకు థియేటర్లని పుష్ప 2 రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటూ ఫ్యాన్స్‌ సందడి కూడా మామూలుగా లేదు. ముందు నుంచి ఈ సినిమా విపరీతమైన బజ్‌ నెలకొంది. ట్రైలర్, పాటలు అది మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని హైప్‌ పుష్ప 2కి ఉంది. ఎక్కడ చూసిన పుష్ప 2 ఫీవరే కనిపిస్తుంది. ఇక ఈరోజు రాత్రి నుంచి పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేయనున్నారు.

ఇక రేపు వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లోకి రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో పుష్ప 2 రిలీజ్‌ను ఆపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్‌ చేశారు. ఇంక రిలీజ్‌కి కొద్ది గంటలే ఉండటంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌ ఫ్యాన్స్‌ని ఆందోళనకు కలిగిస్తున్నాయి. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పుష్ప 2 రిలీజ్‌ నిలివేయాలని ఊహించని కామెంట్స్‌ చేశారు. “పుష్ప 2లో అంతా అబద్ధం చూపించారు. ఎర్రచందనం డన్‌ ధర రూ. 10 లక్షల వరకు ఉంటే.. సినిమాల్లో కోటి పైనే చూపించారు. ఇది యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

పుష్ప చూసి అంతా ఎర్ర చందనం చెట్లను నరకడం మొదలుపెట్టారు. ఈ సమయంలో పుష్ప 2 రిలీజ్‌ అయితే మరెంత ప్రభావం చూపిస్తుందో. వెంటనే సినిమా రిలీజ్‌ అవ్వకుండ బ్యాన్‌ చేయండి. అలాగే సినిమాలో అంతా తప్పుగా చూపించిన డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేసి జైలులో వేయాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ నుంచి ఆయనకు వ్యతిరేకత వస్తుంది. రిలీజ్‌కి ఒక్కరోజు ముందే మూవీ నిలివేయాలనడం కరెక్ట్‌ కాదంటున్నారు. ఇది కావాలని చేస్తున్న కుట్ర అని, బన్నీకి వస్తున్న స్టార్‌డమ్‌, రెస్పాన్స్‌ చూసి కొందరు అసూయ వెల్లగక్కుతున్నారంటూ మండిపడుతున్నారు.