Site icon Prime9

Chiranjeevi: క్రేజీ కాంబో సెట్‌ – చిరంజీవితో జతకట్టిన నాని.. డైరెక్టర్‌ ఎవరంటే!

Hero Nani About Chiranjeevi Next Movie: ఓ క్రేజీ కాంబో సెట్‌ అయ్యింది. మెగాస్టార్‌ చిరంజీవి ఓ యువ దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అతడేవరో కాదు శ్రీకాంత్‌ ఓదెల. హీరో నానితో దసరా సినిమా చేసి ఎంట్రీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. అంతేకాదు తొలి చిత్రంతోనే టాలీవుడ్‌ బాక్సాఫీసుకి వందకోట్ల సినిమాను ఇచ్చాడు. ఇక దసరా నాని కెరీర్‌లోనే ఓ మైలురాయి అని చెప్పాలి. అతడి కెరీర్‌లో వందకోట్లు గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి చిత్రంగా దసరా నిలిచింది. ఈ చిత్రంలో హిట్‌ కాంబో పేరుతెచ్చుకున్న నాని, శ్రీకాంత్‌ ఓదెల కలిసి మరో సినిమాకు కూడా రెడీ అయ్యారు.

దానితో పాటు వీరిద్దరు కలిసి చిరంజీవి మూవీ తెరకెక్కించబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రీలుక్‌ పోస్టర్‌తో చిరంజీవి చిత్రాన్ని ప్రకటించాడు నాని. ఇందులో రక్తంతో తడిసి ఉన్న ఈ ప్రీలుక్‌ పోస్టర్‌ మూవీపై ఆసక్తిని పెంచుతుంది. రక్తంతో తడిచి ఉన్న పోస్టర్‌ షేర్‌ చేస్తూ.. “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. హీరో నాని తన ట్విట్టర్‌లో ఈ పోస్టర్‌ షేర్‌ చేస్తూ “ఆయన నుంచి స్పూర్తి పొందాను. ఆయన కోసం గంటల తరబడి లైన్లో నిలుచున్న. నా సైకిల్‌ పోగోట్టుకున్నా. ఆయన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇప్పుడు ఆయనను మీ ముందుకు తీసుకువస్తున్నా. లైఫ్‌ ఫుల్‌ సర్కిల్‌ అంటే ఇదేనేమో” అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

అదే విధంగా మై బాయ్‌ శ్రీకాంత్‌ ఓదెల కలలు కన్న ఈ ప్రాజెక్ట్‌తో మేము మెగాస్టార్‌ మ్యాడ్‌నెస్‌ని బయటపెట్డానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ హైప్ పెంచాడు నాని. ఇలా శ్రీకాంతో ఓదెల దర్శకత్వంతో చిరంజీవి హీరోగా నాని సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు నాని-శ్రీకాంత్‌ ఓదెల కలిసి మరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీని తర్వాత చిరు శ్రీకాంత్‌ ఓదెలతో సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

Exit mobile version