Last Updated:

Batukamma: రెండవ రోజు అటుకుల బతుకమ్మ

వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.

Batukamma: రెండవ రోజు అటుకుల బతుకమ్మ

Batukamma: వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గోరంట్ల పూలు, పేర్చుకుంటూ, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మను అలంకరిస్తారు. ఈ పండుగను పల్లెల్లో బాగా జరుపుకుంటారు.

నేడు 25 సెప్టెంబర్ 2022 రెండవ రోజు అటుకుల బతుకమ్మ

నేడు రెండవ రోజు అటుకుల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. నేడు అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మను పండుగను జరుపుకుంటారు. బతుకమ్మను పేర్చడానికి ఉదయాన్నే లేచి అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలతో అటుకుల బతుకమ్మను అలంకరిస్తారు. బతుకమ్మకు అటుకులు, పప్పు, బెల్లంతో నైవేద్యం చేసి అమ్మవారికి పెడతారు.

ఇవి కూడా చదవండి: