Turkey blast: టర్కీలో భారీ పేలుడు.. 12 మంది దుర్మరణం
Turkey Massive blast 12 killed in explosives factory: టర్కీలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు సంభవించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బాలికేసిర్ ప్రావిన్స్‌లోని కరేసి జిల్లాలో పేలుడు జరిగిందని సమాచారం.
ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీలో ఉదయం 8.25 నిమిషాలకు ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ప్లాంట్‌లోని కొంత భాగం కూలిపోయిందని ఆ దేశ మంత్రి అలీ యెర్లికాయ పేర్కొన్నారు. దీనిపై పూర్తి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఈ పేలుడు దెబ్బకు భారీగా మంటలు వ్యాపించాయి. జెఎస్ఆర్ ఎక్స్ ప్లోజీవ్స్ ఫ్యాక్టరీలోని ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలింది. దీంతో పాటు చుట్టు పక్కల భవనాలు సైతం దెబ్బతిన్నాయి. క్యాప్సుల్ ప్రొడెక్షన్ విభాగంగా పేర్కొనగా.. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు ఇంటీరియర్ మంత్రి వెల్లడించారు.
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈ విషాదంపై విచారం వ్యక్తం చేశారు. పేలుడు జరిగిన ఘటనలో 12 మంది మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
#WATCH | 12 people killed in ammunition factory blast in Northwest Turkey#TurkeyBlast #AmmunitionFactoryBlast #TurkeyTragedy #TurkeyDisaster pic.twitter.com/9CGpux6cxK
— CLR.CUT (@clr_cut) December 24, 2024