Last Updated:

walnuts Benefits: రోజూ వాల్ నట్స్ తింటున్నారా? తాజా అధ్యయనం తేల్చిందిదే

వాల్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటడం గుండెకు చాలా మంచిది.

walnuts Benefits: రోజూ వాల్ నట్స్ తింటున్నారా? తాజా అధ్యయనం తేల్చిందిదే

walnuts Benefits: ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మందికి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కాస్త శ్రద్ద వహిస్తే సంపూర్ణ అరోగ్యం మన సొంతం అవుతుంది. ముఖ్యంగా డ్రై ప్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ వారి డైట్ లో డ్రై ఫ్రూట్స్ కు చోటు ఇవ్వాలి. వాటిలో కూడా వాల్‌నట్స్ మరింత స్పెషల్ అని చెప్పాలి.

తాజా రీసెర్చ్ లో(walnuts Benefits)

ఏకాగ్రత, మేధో సామర్థ్యాల పెంచుకునేందుకు వాల్‌నట్స్‌ ఎంతో దోహదపడతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. మెదడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ‘ఆల్ఫా-లినోలెనిక్‌ ఆమ్లం’ అనే ఒమేగా 3 రకం కొవ్వు ఆమ్లం ఈ వాల్‌నట్స్‌లో అధికంగా ఉండటమే కారణం అని నిర్థారించారు. ఈ అధ్యయనంలో భాగంగా 11 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 700 మంది పిల్లలను పరిశోధకులు ఎంచుకున్నారు. వారిని రెండు వర్గాలుగా చేసి.. ఓ వర్గం పిల్లలు 6 నెలల పాటు ప్రతిరోజు 30 గ్రాముల వాల్‌నట్స్‌ తప్పనిసరిగా తినేలా చూశారు. మరో వర్గం పిల్లలతో పోలిస్తే వాల్‌నట్స్‌ను రోజూ తిన్నవారిలో ఏకాగ్రత, మనో వికాసం, మేధో సామర్థ్యాలు ఎక్కువగా మెరుగైనట్టు తేల్చారు.

 

డ్రైఫ్రూట్స్ లో రాజుగా

ముఖ్యంగా వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక శాతం ఉంటాయి. అదే విధంగా మెదడు ఆరోగ్యానికి జ్ఞాపకశక్తికి వాల్ నట్ బాగా ఉపయోగపడుతుంది. వాల్‌నట్స్‌లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ లాంటి అనేక పోషకాలు ఉన్నాయి. అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. వాల్ నట్స్ ను డ్రైఫ్రూట్స్ లో రాజు అని కూడా పిలుస్తారు.

వీటిని పచ్చిగా తినడానికి బదులు నానబెట్టి తింటే ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. రాత్రి 2 వాల్ నట్స్ ను నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. నానబెట్టిన వాల్ నట్స్ ను అనేక వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెరల శాతాన్ని నివారించాలనుకుంటే.. నానబెట్టిన వాల్ నట్స్ ను తినడం మంచిది.

వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ వాల్ నట్స్ తీసుకుంటే మలినాలు శుద్ధి అవుతాయి.

Health Benefits of Walnuts You May Not Know About | Sohnrey Family Foods

అనేక రకాల క్యాన్సర్‌ల నుంచి

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో నానబెట్టిన వాల్‌నట్స్ చేర్చుకోండి.

వీటి వినియోగం రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్ ఎల్లాగిటానిన్‌లు ఉంటాయి. ఇది అనేక రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

వాల్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటడం గుండెకు చాలా మంచిది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు వాల్‌నట్స్ ప్రయోజనకరంగా ఉంటాయని అనేక అధ్యయనాలు కూడా నిరూపించాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడి.. మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి.