Last Updated:

Increasing Height: పిల్లలు బాగా ఎత్తు పెరగాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

Increasing Height: పిల్లలు బాగా ఎత్తు పెరగాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

Increasing Height: పిల్లలు బాగా ఎత్తు పెరగాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే , పిల్లలు ఎత్తు పెరగాలంటే అందుకు అవసరమైన పోషకాలను కూడా వారికి అందించాలి. మన దేశంలో సరాసరి ఎత్తు 5 అడుగులు. ఎత్తు పెరగడమనేది వెంటనే సాధ్యమయ్యే పని కాదు. అలా అని కృత్రిమంగా వచ్చేదీ కూడా కాదు.

ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం కూడా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఎదిగే వయసులో పోషకాహార పదార్థాలను రోజూ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

19 Best Foods And Diet For Increasing Height Rapidly | Styles At Life
క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్‌ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి.

బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.

బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు.

ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.

 

Foods to increase you height | Which foods help you grow taller

మంచి పౌష్టికాహారం వల్ల..(Increasing Height)

ఉసిరికాయను రోజు తీసుకోవటం వల్ల ఎత్తు పెరగటానికి సహాయపడుతుంది. ఇందులో ఉన్న సి విటమిన్, పాస్ఫరస్, కాల్షియం, మినరల్స్ పొడవు పెరగటానికి తోడ్పడతాయి.

ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో కొద్దిగా బెల్లం, 5 మిరియాలు, అశ్వగంధ పొడి కలిపి రాత్రిపూట త్రాగాలి. ఇలా 3 నెలల పాటు క్రమం తప్పకుండా చేయటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ఎండిన అంజీర పండ్లు, జీలకర్ర, పటికబెల్లం తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీనిని సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు గ్లాసు పాలలో ఒక స్పూన్ పొడిని కలుపుకొని త్రాగటం వలన బాగా ఎత్తుగా పెరుగుతారు.

మనం రోజువారి తీసుకునే ఆహారంలో బచ్చలకూర, క్యారెట్, బెండకాయ సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.