Home / టాలీవుడ్
హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. అయితే విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు విజయ్ మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని రౌడీ బాయ్ వ్యాఖ్యానించారు.
రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్న RC15 కోసం స్పెషల్ సాంగ్ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. తాజాగా RC15 బృందం ఈ చిత్రానికి సంబంధించిన న్యూజిలాండ్ షెడ్యూల్‌ను ముగించింది.
డిసెంబర్ ఈ ఏడాది చివరి నెల. ఈ నెలలో సాధారణంగా పెద్దగా విడుదలయ్యేవి ఉండవు, ఎందుకంటే అన్ని పెద్ద చిత్రాలు సంక్రాంతికి విడుదల చేయబడతాయి.
కర్నాటక మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై బయోపిక్ తీసేందుకు రంగం సిద్దమైంది. టైటిల్ రోల్ లో నటించేందుకు తమిళ నటుడు విజయ్ సేతుపతిని చిత్ర మేకర్స్ సంప్రదించినట్టు సమాచారం.
కార్తికేయ హీరో బెదురులంక 2012 అనే చిత్రం చేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమా పేరును ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం.
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా నెట్టింట వార్తలు మారుమోగుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్, బాలీవుడ్ మీడియాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని. అవన్నీ రూమర్స్ అని కృతి కొట్టి పారేశారు
లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.
దళపతి విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం వారసుడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ నుంచి 'రంజితమే' సాంగును రిలీజ్ చేశారు చిత్ర బృందం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం మాస్కోకు విమానంలో బయలుదేరాడు. ’పుష్ప ‘ ఇప్పుడు రష్యన్ భాషలోకి డబ్ చేయబడింది. క్రిస్మస్ సీజన్ ప్రారంభానికి ముందు డిసెంబర్ 8న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.