Last Updated:

Dhanush : మరో తెలుగు చిత్రంలో హీరో ధనుష్

తమిళ నటుడు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్ సినిమా షూటింగ్ పూర్తయింది . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2023లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Dhanush : మరో తెలుగు చిత్రంలో హీరో ధనుష్

Dhanush: తమిళ నటుడు ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్ సినిమా షూటింగ్ పూర్తయింది . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2023లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి సంతకం చేసాడు . ఈ చిత్రంషూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. శేఖర్ ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడు. దీనికి ఏషియన్ సినిమాస్ నిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం ధనుష్ మరో తెలుగు చిత్రానికి సంతకం చేశారు. నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల ఇటీవల ధనుష్‌ను కలిశారని సమాచారం. వీరిమధ్య చర్చలు జరుగుతున్నాయి. ధనుష్ సర్ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వేణు ఊడుగుల కోసం ధనుష్‌తో సమావేశం ఏర్పాటు చేసింది. . త్వరలో వేణు ఊడుగుల పూర్తి స్క్రిప్ట్‌ని ధనుష్ వింటారని తరువాత దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్ .

ఇవి కూడా చదవండి: