Samantha: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్ తో ఈ మధ్య హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఏడాది సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి అభిమానులను షాక్ గురి చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఎవరికీ కనపడలేదు. ఇటీవలే శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత కనిపించింది. ఆ ఈవెంట్ లో కంటతడి పెట్టుకోవడంతో కూడా ఒక్క సారిగా వైరల్ అయింది. ఇప్పుటిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటోంది. దీంతో తిరిగి సినిమాలు, యాడ్స్ షూటింగుల్లో పాల్గొంటుంది. కాగా, తాజాగా సమంత తమిళనాడులోని దిండిక్కల్ జిల్లాలోని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండ కింద నుంచి పై మెట్టు వరకు హారతి వెలిగించుకుంటూ వెళ్లింది. ఆలయంలోకి వెళ్లాలంటే దాదాపు 600 మెట్లు ఎక్కాలి. మెట్ల మార్గంలో స్వామి దర్శనానికి వెళ్లిన సమంత.. ప్రతి మెట్టుకు దీపాన్ని వెలికింది. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ఇపుడు ఆలయంలో సమంత పూజలు చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనారోగ్యం నుంచి కోలుకోవాలని సమంత పూజలు జరిపించినట్టు కథనాలు వస్తున్నాయి. సమంత త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా సమంత(Samantha) ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరస్ షూటింగ్ లో జాయిన్ అయింది. త్వరలోని విజయ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ షూటింగ్ లో కూడా పాల్గొంటుందని తెలుస్తోంది.
కాగా సమంత నటించిన శాకుంతలం ఫిబ్రవరి 17 న విడుదల కావాల్సి ఉండగా .. ఇటీవలే రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుంది. వేసవి కానుకగా ఏప్రిల్ 14 న శాకుంతం విడుదల అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడెక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. శాకుంతం సినిమా విడుదల వాయిదా పడటం ఇది రెండోసారి. లాస్ట్ నవంబర్ లోనే అ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు మేకర్స్. కానీ అపుడు వివిధ కారణాలతో ఫిబ్రవరి కి వాయిదా వేశారు. తాజాగా మరోసారి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కు మారింది.
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ ఈ సినిమా కోసం దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఇక ఈ సినిమాను ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. గుణ శేఖర్ ఈ సినిమాని తీస్తున్నారు.