Site icon Prime9

Samantha: అమ్మతనం కోసం ఎదురుచూస్తున్నా – మనసులో మాట బయటపెట్టిన సమంత

Samantha Said She Want to Become a Mother: తల్లిని అవ్వాలని ఉందని అంటుంది స్టార్‌ హీరోయిన్ సమంత. సమంత రీసెంట్‌గా ‘సిటాడెల్‌:హనీ-బన్నీ’ అనే వెబ్‌ సిరీస్‌తో పలకరింది. దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డికే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్‌ పెద్దగా ఆకట్టుకోలేకోపోయింది. దీంతో సిటాడెల్ ప్లాప్‌గా నిలిచింది. అయితే రిలీజ్‌కు ముందు మూవీ టీం ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో చేసింది. ఎక్కడ చూసి వీరి సందడే కనిపించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత తల్లి కావడంపై స్పందించింది.

కాగా సిటాడెల్‌లో సామ్‌ ఓ పాపకు తల్లి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే ఇదే అంశం గురించి నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడింది.  “సిటాడెల్‌లో తల్లిగా చైల్డ్‌ ఆర్టిస్టుతో కలిసి నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. షూటింగ్‌ సెట్లో తనతో ఉన్నంత సేపు నా సొంత కూతురితో ఉన్నట్టే అనిపించింది. దీంతో నిజంగా తల్లిని ఎప్పుడు అవుతానా? అనిపించింది. ఇప్పుడు నాకు అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదోక అద్భుతమైన అనుభవం. ఓ బిడ్డతో అమ్మ అని పిలుపించుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ వయసులో తల్లి అవ్వాలనుకోవడమేంటని అందరు అనుకుంటారేమో. కానీ తల్లి అవ్వడానిక వయసు అనేది అడ్డంకి కాదని నేను నమ్ముతాను” అని సామ్‌ తన మనసులో మాట చెప్పింది. కాగా సమంత హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పదేళ్లు రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్‌లోనే క్యూట్‌ కపుల్‌ అనిపించుకున్నారు. కానీ కొన్నేళ్లకు వీరి వైవాహిక జీవితంలో కలతలు రావడంలో విడిపోయారు.

2021 అక్టోబర్‌ 2న విడాకులు తీసుకున్నట్టు చై-సామ్‌ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకులు అనంతరం సమంత కొంతకాలం తర్వాత మయోసైటిస్‌ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చి విదేశాల్లో చికిత్స తీసుకుంది. మయోసైటిస్‌ నుంచి కోలుకున్న సామ్‌ తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. విడాకుల తర్వాత ఇప్పటికి సింగిల్‌గా ఉన్న సమంత. కానీ నాగచైతన్య మాత్రం నటి శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు.

Exit mobile version