Tamil Nadu BSP chief Armstrong Murder:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. 52 ఏళ్ల ఆర్మ్‌స్ట్రాంగ్ వృత్తిరీత్యా న్యాయవాది. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడిలో . ఆర్మ్‌స్ట్రాంగ్ సమీపంలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడి చికిత్స పొందుతున్నారు.
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో బీఎస్పీ కార్యకర్తలు, మద్దతుదారులు అతని హత్యకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో రహదారిని దిగ్బంధించారు.ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి పట్ల బీఎస్పీ అధినేత్రి మాయావతి , దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో బలమైన దళిత గొంతును చంపిన వ్యక్తులను తమిళనాడు ప్రభుత్వం శిక్షించాలని మాయావతి డిమాండ్ చేసారు. ఇలా ఉండగా చెన్నై పోలీసులు ఈ కేసుకు సంబంధించి 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.