Site icon Prime9

Samantha: ఫస్ట్‌టైం రెండో పెళ్లిపై నోరు విప్పిన సమంత – ఏం చెప్పిందంటే..!

Samantha Second marriage

Samantha Comments on Second Marriage: స్టార్‌ హీరోయిన్‌ సమంత రెండో పెళ్లిపై స్పందించింది. ఇంతకాలం తన పెళ్లి, రిలేషన్ రూమర్స్ సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌ ప్రమోషన్స్‌లో సామ్‌ సెకండ్‌ మ్యారేజ్‌ గురించి తేల్చేసింది. కాగా ఆమె మాజీ భర్త, హీరో హీరో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రెండో పెళ్లి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొంతకాలం వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆగష్టు 8న ఇరుకుటుంబ సభ్యులు సమక్షంలో గుట్టుచప్పుడు కాకుండ నిశ్చితార్థం చేసుకున్నారు.

అనంతరం నాగచైతన్య-శోభితల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను నాగార్జున ఎక్స్‌ వేదిక షేర్ చేశాడు. దీంతో అవి చూసి అంతా షాక్‌ అయ్యారు. కొద్ది రోజులు చై-శోభిత నిశ్చితార్థం గురించే అంతా మాట్లాడుకున్నారు. దీంతో నాగచైతన్య-సమంత విడాకులకు కారణం ఏంటనేది అదరికి క్లారిటీ వచ్చింది. శోభితతో రిలేషన్‌ వల్లే చై-సామ్‌ విడిపోయారని వీరి ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. దీంతో సమంత కూడా హాట్‌టాపిక్‌ మారింది. ఇక త్వరలోనే చై-శోభితల పెళ్లి కూడా జరగనుంది.

ఇటీవల ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించిన పసుపు దంచుతున్న ఫోటోలను శోభిత షేర్ చేయగా.. ఇక పెళ్లి ముహుర్తం ఖారారైందని తేలిపోయింది. నాగ చైతన్య-శోభితల పెళ్లి వార్తతో ఇప్పుడు అంతా సమంత రెండో పెళ్లి గురించి ఆరా తీస్తున్నారు. ఎలాగే చై, మరోసారి ఓ ఇంటివాడు అవుతున్నాడు. మరి సమంత పరిస్థితి ఏంటా అని అంతా సమంత వైపే చూస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు రెండో పెళ్లి కబురు చెబుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’ వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.

త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైంలో విడుదల కాబోతోంది. దీంతో మూవీ టీంతో పాటు సామ్‌ కూడా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గోంటుంది. ఈ క్రమంలో సమంతకు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ఇప్పటి వరకు రెండో పెళ్లిపై నోరు విప్పని సామ్‌ మొట్టమొదటి పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. “నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ అది వర్కౌట్‌ కాలేదు. మేమిద్దరం విడిపోయాం. ఇక మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన లేదు. నాకు అసలు రెండో పెళ్లి అనే ఆలోచన అనేదే లేదు. ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉన్నా. జీవితంలో ఇక నాకు తోడు అవసరం లేదు అనిపిస్తుంది” అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Exit mobile version