Last Updated:

పవన్ కళ్యాణ్: బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్.. ఎప్పుడంటే..?

జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ వార్తతో ఇటు నందమూరి ఫ్యాన్స్ సహా అటు మెగా అభిమానులు పండుగ చెసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్: బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్.. ఎప్పుడంటే..?

Balakrishna Unstoppable 2: దెబ్బకి థింకింగ్ మారిపోవాలంతే అంటూ అన్‌స్టాపబుల్ 2తో రంగంలోకి దిగారు నందమూరి నటసింహం. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వేదికగా అన్ స్టాపబుల్ షో ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలకృష్ణలోని మరో యాంగిల్ ను యావత్ ప్రేక్షకులు తెలిసేలా చేసింది అన్ స్టాపబుల్ షో. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖలైన వారిని ఈ షోకి పిలిపించి బాలకృష్ణ వారితో సందడి సందడి చేస్తూ వారి సీక్రెట్ లను బయటకు లాగే ప్రయత్నం చెయ్యడం.. వారితో ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఆడిపించడం పంచుల్ సెటైర్లు అబ్బో ఒకటేమిటి మొత్తంగా చెప్పాలంటే అన్ స్టాపబుల్ షో ఫుల్ ఫ్యాక్డ్ ఎంటర్ టైనర్ అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కోసం చంద్రబాబు, లోకేష్‌లను పిలిచి ఈ షోపై అమాంతం బజ్ పెంచారు ఆహా టీం. అంతే కాకుండా రెండో ఎపిసోడ్ లో అయితే సిద్దు జొన్నలగడ్డతో పాటు వచ్చిన మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ లను బాలయ్య ఫుట్ బాల్ ఆడుకున్నారనే చెప్పాలి. ఇక థర్డ్ ఎపిసోడ్ కోసం అడవి శేష్, శర్వానంద్‌లను పిలిచి.. ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బాలయ్య స్నేహితులు, పొలిటీషన్స్ అయిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలను రప్పించి సందడి చేశారు. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లెజెండరీ డైరెక్టర్, నిర్మాతలు అయిన రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబులు వచ్చారు. ఇక ఈ వారం టెలికాస్ట్ అవనున్న షోలో పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ అయిన ప్రభాస్ మరియు హీరో గోపిచంద్ రానున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సహా సామాన్య వీక్షకులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలయ్య ప్రభాస్, గోపీచంద్ లతో ఏవిధంగా ఆడుకోనున్నారు. ఎలాంటి కూపీలు రాబట్టనున్నారు అనే అంశాల కోసం వీక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

pawan kalyan in NBK unstoppable show

ఇకపోతే మొదటి సీజన్‌లో ఓటీటీ రేటింగులు బద్ధలు కొట్టిన ఈ షో.. రెండవ సీజన్ అంతకన్నా అదుర్స్ అనిపించేలా ప్లాన్స్ చేశారు. ఇప్పటికే వివిధ రంగాలకు చెందినవారు గెస్టులుగా వచ్చి అలరించారు. అయితే తాజాగా మరో బిగ్ స్టార్ ఈ షోకు రానున్నట్టు న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ వార్తతో ఇటు నందమూరి ఫ్యాన్స్ సహా అటు మెగా అభిమానులు పండుగ చెసుకుంటున్నారు. అసలు ఈ కాంబో ఒకే వేదికపై కనిపించనున్నారన్న వార్తే ఇంత ఆనందంగా ఉంటే వారిద్దరూ కలిసి టాక్ షోలో సందడి చేస్తే చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఇక నందమూరి, పవర్ స్టార్ అభిమానులకైతే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయే చెప్పాలి.

ఈ ఇద్దరూ అటు మాస్ ఇటు క్లాస్ మరోవైపు పొలిటికల్ ఇమేజ్ ఉన్న హీరోలే ఇక వీరిద్దరూ తొలిసారి ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారు. మరి వారు అన్ స్టాపబుల్ వేదికగా ఏమేం ముచ్చటించనున్నారు. ఎలాంటి అనుభవాలు షేర్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు రూమర్‌గా ఉన్న ఈ వార్త ఇప్పుడు నిజమని తేలింది. గతంలో నిర్మాత నాగవంశీ వచ్చినప్పుడు బాలకృష్ణ త్రివిక్రమ్ కు ఫోన్ చేసి ఎప్పుడు ఈ షోకి వస్తున్నారు అంటూ అడిగారు.. దానికి త్రివిక్రమ్ మీరిప్పుడు రమ్మంటే వచ్చేస్తా అంటూ సమాధానం ఇచ్చారు. దానికి బాలయ్య ఎవరితో రావాలో తెలుసుగా అంటూ అనడంతో.. త్రివిక్రమ్ ఎవరితో రానున్నారు అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలిగింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్.. వారిద్దరి కాంబోలో సూపర్ హిట్ మూవీలైన జల్సా, అత్తారింటికి దారేది వచ్చాయి కాబట్టి.. ఇక పవన్, త్రివిక్రమ్ కలిసి రాబోతున్నారంటూ చిన్న క్లూ ఇచ్చీ ఇవ్వనట్టుగా ఆహా గ్లింప్స్ వీడియోను నెట్టింట విడుదల చేసింది. దానికి తోడుగా నాగవంశీ కూడా డిసెంబర్ 27న సిద్దంగా ఉండండి ఆహా వేదికగా బిగ్ స్మాషింగ్ బ్లాస్ట్ రానుందంటూ ట్వీట్ చెయ్యడంతో నెట్టింట ఈ విషయంపై పెద్ద రచ్చే నడుస్తోంది.

నెక్ట్ పవర్ స్టార్ అన్ స్టాపబుల్ లో సందడి చెయ్యనున్నారా అంటూ అభిమానులు రిట్వీట్లు చేస్తున్నారు. ఈ షో ఇక అదిరిపోతుంది అంటూ ఎంతో ఎక్సైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ప్రజంట్ ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే.. అంతకు మించీ అన్నట్టుగా ఈ బంపర్ బోనంజా న్యూస్ రావడంతో అటు అన్‌స్టాపబుల్ అభిమానులు సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఇదీ చదవండి: రిలీజ్ కి ముందే అవతార్ 2 పైరసీ…

ఇవి కూడా చదవండి: