Kannappa Collections: నాతో సినిమా తీయడానికి దర్శకులు లేరు: మంచు విష్ణు

Kannappa Collections: కన్నప్ప సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు మంచు విష్ణు. తన కెరీర్ కు బూస్ట్ ఇవ్వాలని భారీ తారాగణాన్ని ఆశ్రయించాడు. అనుకున్నట్టుగానే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ లు ఇందులో నటించారు. అయితే కన్నప్ప సినిమా రిలీజ్ అయి ఇప్పటికి నాలుగు రోజులు అవుతుంది. డైరెక్టర్, అక్షయ్ కుమార్ బాలీవుడ్ నుంచి కావడంతో కన్నప్ప సినిమాపై హిందీ మీడియా కూడా ఆసక్తిగా కథనాలు రాస్తుంది. తాజాగా కన్నప్ప ఈ మూడురోజుల్లో ఎంత కలెక్షన్ చేసిందన్న విషయంపై చర్చ నడుస్తోంది. అసలు ఆక్యుపెన్సీ ఎంత ఫిల్ అవుతున్నారని చూస్తున్నారు.
మంచు విష్ణు కెరీర్ లోనే బెస్టె ఓపెనింగ్స్ కన్నప్ప మూవీకి దక్కింది. దాదాపు మొదటి రోజు రూ.10కోట్ల రూపాయలను సాధించింది కన్నప్ప. రెండవ రోజు రూ.7కోట్లు రాబట్టించి మొత్తం మూడు రోజులకు కలిపి రూ.30 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.
హిందీలో రూ.1.5 కోట్లు, తమిళంలో రూ.35 లక్షలు, మలయాలంలో రూ.35లక్షల కన్నడంలో రూ.10 లక్షలను రాబట్టింది. ఓవర్సీస్ లో మాత్రం సినిమా ఆశించినంతగా పుంజుకోవడం లేదని తెలుస్తోంది. తొలి రెండు రోజులు బుకింగ్స్ బానే ఉన్నప్పటికి మూడవరోజు డల్ అయ్యాయి. కన్నప్ప సినిమాకు ఓవరాల్ గా 39.93% ఆక్యుపెన్సీ వచ్చింది.
నాతో సినిమా తీయడానికి తెలుగు దర్శకులు రెడీగా లేరు…
కన్నప్ప సినిమాకు ఓపెనింగ్స్ మంచిగా రావడంతో విష్ణు థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ తన సినిమాకు మంచి వసూళ్ళు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఇందుకుగాను ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలిపాడు. అయితే దర్శకుడిని ఎందుకు హిందీనుంచి తీసుకున్నారు, తెలుగులో దర్శకులు చాలామంది ఉన్నారు కదా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విష్ణు సమాదానం ఇస్తూ… నాతో సినిమా తీయడానికి ఎవరూ రెడీగా లేరు, ఆపై నాకు గత సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. అందుకే హిందీ నుంచి దర్శకుడిని తెచ్చుకున్నానని కుండబద్దలుకొట్టారు. కాగా సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. సినిమాను నిర్మించడానికి 100కోట్లు ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మూడు రోజుల్లో మాత్రం 30కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.
కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరూ పైరసీని ప్రోత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 30వేల లింక్‌లను తొలగించామని చెప్పారు. ఈ విషయంలో ఎంతో బాధగా ఉందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సరైన మార్గంలో కన్నప్పను ఆదరించండని అన్నారు.