Last Updated:

Narasimha Naidu Re Release : రీ రిలీజ్ కి రెడీ అయిన బాలయ్య “నరసింహ నాయుడు”.. ఏకంగా 1000 థియేటర్లలో !

ఇటీవల వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. జూన్ 10 వ తేదీన బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా.. తన సూపర్ హిట్ సినిమా "నరసింహ నాయుడు"ని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

Narasimha Naidu Re Release : రీ రిలీజ్ కి రెడీ అయిన బాలయ్య “నరసింహ నాయుడు”.. ఏకంగా 1000 థియేటర్లలో !

Narasimha Naidu Re Release : ఇటీవల వరుసగా పలు సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. జూన్ 10 వ తేదీన బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా.. తన సూపర్ హిట్ సినిమా “నరసింహ నాయుడు”ని రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా నిర్మాత ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. చరిత్ర సృష్టించిన నరసింహనాయుడు సినిమాని డిజిటలైజ్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో విడుదల చేయనున్నామని తెలిపారు.

2001 లో రిలీజైన ఈ మూవీ భారీ విజయం సాధించింది. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా 30 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. లక్స్ పాప, చిలకపచ్చ కోక, నిన్నా కుట్టేసినాది, అబ్బా అబ్బా.. పాటలు మారుమోగాయి. ఇప్పటికి మంచి మాస్ సాంగ్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో బాలయ్య నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. బాలయ్య సరసన.. సిమ్రాన్, పుర్రెతి జింగ్యానీ హీరోయిన్స్ గా నటించారు. కె. విశ్వనాథ్, ముకేశ్ రిషి, జయప్రకాశ్ రెడ్డి.. ఆశా షైనీ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, అచ్యుత్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించనుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కత్తులతో కాదురా కంటి చూపులతో చంపేస్తా అన్న ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ డైలాగ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్.  పరుచూరి బ్రదర్స్‌ ఇచ్చిన డైలాగ్స్.. మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక అప్పట్లో విజయవాడలో జరిగిన ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్‌ని ఎప్పటికీ మరచిపోలేరు అని దర్శకుడు బి.గోపాల్ వ్యాఖ్యానించారు.

నందమూరి బాలకృష్ణ” ప్రస్తుతం ఫుల్ జోష్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి బాలయ్యని ఏ విధంగా చూపిస్తారో అని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్స్ తో నెక్స్ట్ లెవల్ పక్కా అని క్లారిటీ ఇచ్చేశాడు. నిన్ననే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా టైటిల్ తో పాటు కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిట్ ఖరారు చేశారు. ‘ఐ డోంట్ కేర్’ అని ఉప శీర్షిక ఇచ్చారు.