Bigg boss 6: వర్కింగ్ ఉమెన్స్ కు కీర్తి ఒక ఇన్స్పిరేషన్ అన్న బిగ్ బాస్ మానస్
Bigg boss 6: వర్కింగ్ ఉమెన్స్ కు కీర్తి ఒక ఇన్స్పిరేషన్ అన్న బిగ్ బాస్ మానస్
Bigg boss 6: కీర్తి భట్ ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అయింది.మొదటి మూడువారాలు తన ఆటతో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన కీర్తి..నాలుగోవారం మాత్రం ఏకంగా బిగ్ బాస్ ఇంటికి కెప్టెన్ అయ్యింది.మనసిచ్చి చూడు,కార్తీకదీపం సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి.. బిగ్ బాస్ షోతో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.మన భాష కాకపోవడంతో పాటు.. తాను చెప్పాల్సిన విషయాన్ని ఎదుటి వాళ్ళకి సరిగా చెప్పలేకపోతుంది.దీనికి తోడు ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఫ్యామిలీ సమస్యలతో ఎమోషనల్ ఐనా కీర్తి బిగ్ బాస్ ఇంట్లో చాలా వీక్‌గా కనిపిస్తుంది.బిగ్ బాస్ ఇంటిలో సరిగా రాణించలేకపోతుంది. కొంతమంది ఐతే ఆమె సింపథీ గేమ్ ఆడుతుందంటూ ఆమె హౌస్‌లో మరో రెండు మూడు వారాలకంటే ఎక్కువ ఉండటం చాలా కష్టమని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా మానస్.. కీర్తికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను మనతో పంచుకున్నారు.
‘కీర్తి నా కోస్టార్.. ఆమె టైటిల్ విన్నర్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నాకు తెలుసు కాబట్టి..తన గురించి నాకు బాగా తెలుసు.తను చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి.తల్లిదండ్రుల్ని.. ఫ్యామిలీ మొత్తాన్ని పోగుట్టుకున్నా కూడా తనలాంటి జీవితం ఇంకొకరికి రాకూడదని..ఓ అనాధ పాపని పెంచుకుంటుంది.దత్తత తీసుకున్నాను అని చెప్పడం కూడా తనకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో తనకి తెలుసు..తను ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఎక్కడా చెప్పదు.ఫ్యూచర్లో ఆ అమ్మాయి చూస్తే ఫీల్ అవుతుందేమో అని.. ఆ పాప గురించి ఎక్కడా చెప్పదు.కీర్తి నాతో..చాలా సార్లు నాకు ఆ బిడ్డ ఫ్యూచర్ ముఖ్యం అని చెప్పేది.. కీర్తి పాపను కూడా నేను ఎప్పుడూ చూడలేదు.. ఎప్పుడూ తీసుకుని రాలేదు..ఆ పాప కండిషన్ కూడా బాలేదని ఈ మధ్యనే తెలిసింది.వర్కింగ్ ఉమెన్స్ చాలామందికి కీర్తి ఒక ఇన్స్పిరేషన్.మా అమ్మని చూసిన తరువాత ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్‌ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మానస్.