Last Updated:

Pushpa 2: ‘పుష్ప 2’ రికార్డులు బ్రేక్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Pushpa 2: ‘పుష్ప 2’ రికార్డులు బ్రేక్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Pushpa 2 box office first day collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ మూవీకి సుకుమార్ దర్వకత్వం వహించగా.. రష్మిక మందన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. భాారీ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను పరిశీలిస్తే.. తొలిరోజే బాక్స్ ఆఫీస్ షేక్ చేసేలా కలెక్షన్లను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప 2’ సినిమా సుమారు రూ.175 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.95.1కోట్లు వసూలు చేయగా.. అమెరికాలో ఏకంగా రూ.35కోట్లు వసూలు చేసింది. ఇక, హిందీ వర్షన్‌లో రూ.67కోట్లు వసూలవ్వగా.. తమిళనాడులో రూ.7 కోట్లు, కేరళలో రూ.5 కోట్లు, కన్నడ పరిశ్రమలో రూ.కోటి వసూళ్లు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తొలి రోజు వచ్చిన కలెక్షన్లలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, అమెరికాలో భారతీయ సినిమాకు ఈ స్థాయిలో(రూ.35కోట్లు) వసూళ్లు చేసిన మూడో భారతీయ చిత్రంగా పుష్ప2 రికార్డు నమోదైంది.