MBBS seat in Pondicherry: నీట్ పరీక్ష ద్వారా పలు రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్లు ప్రారంభవుతున్నాయి. ఈ నేపధ్యంలో బయట రాష్ట్రాల్లో చదువుదామనుకునే తెలుగు విద్యార్దులు నాన్ లోకల్ కోటాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బి కేటగిరిలో సీట్లు పొందలేని విద్యార్దులకు పాండిచ్చేరి మంచి అవకాశమని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
పాండిచ్చేరిలో మూడు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. నాన్ లోకల్ కోటా కింద అప్లై చేసుకోవచ్చు. పదిహేనేళ్ల కిందట పెట్టిన కాలేజీలు కాబట్టి ఆసుపత్రులు, ఫ్యాకల్లీ బాగుంటాయని సతీష్ చెబుతున్నారు పాండిచ్చేరిలో నాన్ లోకల్ కోటాలో రెండు కేటగిరీలు ఉంటాయి. తెలుగు మైనారిటీస్ కోటా కూడా ఉంది. మేనేజ్ మెంట్ కోటా రూ. 16 లక్షలు ఉండగా ఎన్ఆర్ఐ కోటా రూ.20 లక్షలు ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలు, కాలేజీలతో పోల్చితే ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా సీటు ఫీజు తక్కువే. వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో నాన్ లోకల్ కోటాలో కటాఫ్ ఒసికి 135 మార్కులు, తెలుగు మైనారిటీ 245 మార్కులు గా ఉంది. వినాయగర్ మెడికల్ కాలేజీలో 235 కటాఫ్ గా ఉంది. పుదుచ్చేరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 318, కటాఫ్ గా ఉంది. ఈ కాలేజీల్లో రూ.16 లక్షలకే సీటు వస్తుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఈ కో ర్సులకు సంబంధించి విద్యార్దులకు ఎటువంటి సందేహాలు ఉన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.