MBBS seats in Telangana: నీట్ కౌన్సిలింగ్ తెలంగాణలో ప్రారంభమవుతున్న నేపధ్యంలో చాలామంది విద్యార్దులు తమకు సీటు వస్తుందా రాదా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే గతంలో కంటే మెడికల్ సీట్లు పెరిగినందున కంగారు పడనవసరం లేదని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు. మెదటి, రెండు, మాప్ అప్ రౌండ్లు అయ్యాక కూడా గత ఏడాది పలు ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరి సీట్లు మిగిలిపోయాయని అయన చెబుుతన్నారు. అందువలన విద్యార్దులు, వారి తల్లిదండ్రులు తొందరపడి సీ కేటగిరీకి కమిట్ అవ్వనక్కరలేదని ఆయన తెలిపారు.
ప్రతీ సీటు కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ.. ( MBBS seats in Telangana)
ముఖ్యంగా బి కేటగిరీ సీట్లలో తెలంగాణ విద్యార్దులకు 85 శాతం, నాన్ తెలంగాణ విద్యార్దులకు 15 శాతం రిజర్వేషన్ ఉంటుంది. గత ఏడాది కౌన్సిలింగ్ ను పరిశీలించినపుడు అన్ని రౌండ్లు పూర్తయ్యాక కూడా అపోలో, కామినేని, ప్రతిమ, ఎంఎన్ఆర్, మమత, ఎస్వీవిఎస్ , మహేశ్వర మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్లు మిగిలాయని సతీష్ చెబుతున్నారు. తెలంగాణలో మొత్తం 23 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మరికొన్ని కాలేజీలు అదనంగా వస్తున్న నేపధ్యంలో సీట్లు పెరిగే అవకాశముంది. అందువలన విద్యార్దులు కంగారుపడకుండా స్టే వేకెన్సీ రౌండ్ కు వెళ్లాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతీ సీటు కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయమని చెప్పింది. అందువలన విద్యార్దులు బ్రోకర్ల మాట విని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టనవసరం లేదని సతీష్ పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించి విద్యార్దులకు ఎటువంటి సందేహాలున్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.