Jagananna Civils Protsahakam : జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పథకాన్ని ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 07:30 PM IST

Jagananna Civils Protsahakam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, వగైరా వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం వివరాలు..   

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఈ పథకం వర్తిస్తుంది.

సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్దులకు వారు మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుంది.

ఇక మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు ఇంటర్వ్యూలకు అవసరమైన కోచింగ్, ఇతర అవసరాల కోసం 50 వేల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.

అయితే పథకానికి ఎలాంటి అర్హతలుండాలనే దానిపై జీవోలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆర్థికంగా వెనుకబడిన, ఈబీసీ వర్గాలకు పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ప‌థకం పొందేందుకు అర్హతలు ఇవే..

జ‌గ‌న‌న్న సివిల్స్ ప్రోత్సాహం ప‌థకం లబ్ధి పొందడానికి అభ్యర్ధులు తాము సివిల్స్ ప్రిలిమ్స్ లేదా మెయిన్స్‌లో అర్హత సాధించిన‌ట్లు ఫ్రూఫ్ చూపించాల్సి ఉంటుంది.

సివిల్స్ ప‌రీక్షలు క్వాలిఫై అయిన వారికి ప‌థకం వ‌ర్తిస్తుంది.

అభ్యర్ధుల కుటుంబాల వార్షిక ఆదాయ‌ప‌రిమితి 8 ల‌క్షల‌కు మించ‌కూడ‌దు.

అభ్యర్ధుల కుటుంబాల‌కు 10 ఎక‌రాలలోపు మాగాణి లేదా 25 ఎక‌రాల లోపు మెట్ల భూమి మాత్రమే ఉండాలి.

కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండ‌కూడ‌దు.

సివిల్స్ ఫలితాలు విడుద‌లైన 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.