integrated courses: చాలా యూనివర్శిటీలు ఇపుడు 12 వ తరగతి తరగతి తరువాత ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో బీఎస్సీప్లస్ ఎమ్మెస్సీ, బిటెక్ ప్లస్ ఎంటెక్ తదితర కోర్సులు ఉంటున్నాయి. ఈ కోర్సులు చేయడం మంచిదేనా ? అయితే ఈ కోర్సులు చేద్దామనుకున్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ కుమార్ .
సాధారణంగా మొత్తం కోర్సు అంతా ఒకటే సబ్జెక్ట్ లో చేద్దామనుకున్న వారికి పరవాలేదు. కాని పీజీలో మారుదామంటే అవదు. ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. కంప్యూటర్ సైన్స్ వంటివాటికి సమస్య ఉండదు. కొన్ని కోర్సులకు నాలుగేళ్ల తరువాత ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. అందువల్ల బీఎస్సీప్లస్ ఎమ్మెస్సీ, బిటెక్ ప్లస్ ఎంటెక్ కోర్సులు చేద్దామంటే ఆలోచించుకోవాలి. ఈ తరహా ఎంటెక్ చేసిన వారికి విదేశాల్లో కొన్ని యూనివర్శిటీలు ఎంఎస్ లో అడ్మిషన్ ఇవ్వడం లేదు. డైరక్టుగా పిహెడ్డీ ప్రవేశానికి అయితే పరవాలేదు. అయితే ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు రాని వారు మంచి కాలేజీ, కోర్సు అయితే వీటిని ఎంపిక చేసుకోవచ్చు. అయితే జాయిన్ అయ్యేటపుడు ఇందులోనే కంటిన్యూ అవుతామా లేదా అన్నది ఆలోచించుకోవాలని సతీష చెబుతున్నారు. ఈ కోర్సులకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.