Education And Careers: ప్రస్తుతం కాలంలో చదవు అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయ్యింది. మనం ఎక్కడ చదివినా చిన్ననాటి నుంచే మంచి విద్యను అందించాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అయితే ఆ విద్యలో అనేక రకాల సిలబస్ లు ఉన్నాయి. మరి స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అంటే ఏంటి.. ఏ విద్యార్థులు ఎలాంటి సిలబస్ తీసుకుంటే మంచిది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో
తెలుసుకుందాం.
సెంట్రల్ సిలబస్ రెండురకాలు సీబీఎస్సీ ఐఎస్సీ ఐసీఐసీ(10వ తరగతి వరకు). ఐబీ కరిక్యులమ్ కేంబ్రిడ్జ్ సిలబస్ ఇలా మొత్తంగా 5రకాల సిలబస్ లు ఉన్నాయి. సీబీఎస్సీలో 12లో మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేట్ సిలబస్ లో అయితే 11లో కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది. ఐఐటీ జేఈఈ కోచింగ్ అప్పుడు కచ్చితంగా స్టేట్ సిలబస్ చదవాల్సి ఉంది. అప్పుడు చాలా మంది విద్యార్థులు సెంట్రల్ సిలబస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఐఎస్సీ సిలబస్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ సిలబస్ తీసుకోవడం వల్ల ఎన్ని సబ్జెట్స్ అయినా తీసుకోవచ్చు కానీ పర్సంటేజ్ విషయానికి వస్తే ఇందులో 4 సబ్జెట్స్ పర్సంటేజ్ ని మాత్రమే కాలిక్యులేట్ చేస్తారు. అదే సీబీఎస్సీలో అయితే 5 సబ్జెట్స్ ని పర్సంటేజ్ ని కాలిక్యులేట్ చేస్తారు. ఇకపోతే సెంట్రల్ సిలబస్ చదవడం ద్వారా విదేశాలకు వెళ్లి చదివే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ స్కిల్స్ ని పెంచుకోవచ్చు. ఇకపోతే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంత స్టేట్ సిలబస్ చదవిన విద్యార్థుల అప్లికేషన్స్ ని కొన్ని ఫారెన్ కాలేజీలు తిరస్కరిస్తున్నాయని సతీష్ కుమార్ గారు వివరించారు.
అంతే కాకుండా ఇంటర్ తరువాత విద్యార్దులు ఎటువంటి కోర్సులు చదివితే బాగుంటుంది? సీఎస్ఈ ద్వారా వచ్చే ఉద్యోగాలు ఏంటి.. గేట్, జేఈఈ మెయిన్స్ ని ఎలా ఛేదించాలి, ఎలాంటి కళాశాలల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు.. సివిల్స్ కు ప్రణాళికాబద్దంగా ఎలా ప్రిపేరవ్వాలి ఇవే కాక విద్యపరంగా ఎలాంటి ప్రశ్నలు లేదా సూచనలు కావాలన్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ ను 8886629883 సంప్రదించవచ్చు.