Home / బ్రేకింగ్ న్యూస్
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. అవును మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీఅనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ సందర్భంగా బెయిల్ షరతులను మాత్రం కింది కోర్టు విధించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ట్రయల్ మాత్రమే.. అసలు కథ ముందుంది అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. నిన్న కేసీఆర్ కూతురు కవితను సీబీఐ సుదీర్ఘ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆ విచారణ అనంతరం కూడా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా ముగియలేదని పేర్కొంటూ సీబీఐ అధికారులు మరోసారి కవితకు సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చారు.
వన్షిక (Vanshika) బ్రేకప్ వీడియో ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 8వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు చండీగఢ్‌కు చెందిన @hajarkagalwa అనే యూజర్ ఇషా పేరుతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయ్యింది. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. 15 లక్షల మంది వీడియో చూశారు. ‘ప్రాబబ్లీ ఫన్నీయెస్ట్ పోస్ట్ బ్రేకప్ క్రైయింగ్ సెషన్’ పేరుతో ఇషా ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా దీనికి స్పందించింది.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య పై మున్సిపల్ చైర్మన్ జె.సి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు
మాకు రీమేక్ సినిమాలు వద్దు స్ట్రెయిట్ సినిమాలే కావాలంటూ పవన్ అభిమానులు #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. పవన్ హరీష్ శంకర్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటన రావడంతో పవన్ అభిమానులంతా ఎంతగానో సంతోషించారు. అయితే ఈ ప్రకటన వచ్చి ఏడాది అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోడవంతో ఫ్యాన్స్ నిరాసచెందుతున్నారు.
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్లో 182, హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.