Last Updated:

Hyundai Alcazar: దుమ్మురేపుతున్న అల్కాజార్ సేల్స్.. సూపర్ హిట్ అయినట్లేగా..!

Hyundai Alcazar: దుమ్మురేపుతున్న అల్కాజార్ సేల్స్.. సూపర్ హిట్ అయినట్లేగా..!

Hyundai Alcazar: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని గత నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 6,  7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ప్రీమియం SUV. ఇదిలా ఉండగా గత నెల అల్కాజర్ మోడల్ విక్రయాల నివేదిక వెల్లడైంది. హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ గత నెలలో 2,712 యూనిట్లను విక్రయించింది. గతేడాది సెప్టెంబరు నెలలో 1,977 యూనిట్ల అల్కాజర్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.

గత నెల విక్రయాలతో పోలిస్తే 37 శాతం వృద్ధిని సాధించింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త హ్యుందాయ్ అల్కాజార్ SUV రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లను పొందింది. ఈ కొత్త Alcazar ఫేస్‌లిఫ్ట్  పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 14.99 లక్షల నుండి ప్రారంభం కాగా, డీజిల్ వేరియంట్‌లు రూ. 15.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్.

ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజర్ SUV 2 పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. ముందుగా 1.5-లీటర్ GDT టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 158 bhp శక్తిని, 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 113 bhp గరిష్ట శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఈ కారు వేరియంట్‌లను బట్టి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 7 స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో నార్మల్, ఎకో, స్పోర్ట్ అనే 3 డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది స్నో, మడ్, సాండ్ ఇసుక అనే 3 ట్రాక్షన్ మోడ్‌లను పొందుతుంది. స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌లను కలిగి ఉంటుంది.

పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ 17.5 kmpl మైలేజ్, 7 స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్ మోడల్ మైలేజ్ 18 kmpl. 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్‌తో కూడిన డీజిల్ ఇంజన్ 20.4 kmpl మైలేజీని, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్ 18.1 kmpl మైలేజీని అందిస్తుంది.

2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ SUV ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. లెక్సస్ ఫేస్‌లిఫ్ట్ SUV వెలుపలి భాగంలో వినూత్నమైన గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, H-ఆకారపు LED DRLలు, 18 అంగుళాల డైమండ్క ట్ అల్లాయ్ వీల్స్, LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్ మరింత అధునాతనంగా ఉంటుంది.

కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ పెర్ల్, రేంజర్ ఖాకీ, ఫైరీ రెడ్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే మ్యాట్ వంటి 9 రంగుల ఎంపికలో కూడా అందుబాటులో ఉంది. ఈ కొత్త ప్రీమియం ఎస్‌యూవీ 4,560 mm పొడవు, 1,800 mm వెడల్పు, 1,710 mm ఎత్తు, 2,760 mm వీల్‌బేస్‌తో ఉంటుంది.

కొత్త హ్యుందాయ్ అల్కాజార్ SUV డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 6 ఎయిర్‌బ్యాగ్‌ల కోసం 10.25 అంగుళాల డిస్ప్లేలను పొందుతుంది. 6/7 సీట్ల ఎంపికలో కూడా అందుబాటులో ఉంది.