Home /Author
తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ పై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో కొంతమంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. ఉన్నత విద్యామండలి పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షలు, ఆగస్ట్ 1న ఈ-సెట్, ఆగస్ట్ 2 నుంచి 5 వరకు పీజీ ఈ-సెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్, ఈసెట్
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించినప్పటి నుండి, ఈ చిత్రానికి అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది హాలీవుడ్ దర్శకులు, విమర్శకులు మరియు రచయితలు ఈ చిత్రాన్ని కొనియాడారు
'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడినప్పటి నుండి హీరో రవితేజ రీ-షూట్ల కోసం నిర్మాత ముందు అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, అందుకే ఆలస్యమవుతుందని అన్ని చోట్లా పుకార్లు వచ్చాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరితో ఈ రెమ్యూనరేషన్ సమస్య గురించి రవితేజను ప్రశ్నించగా అవి కేవలం పుకార్లని కొట్టిపారేసారు.
లెజెండరీ బాలీవుడ్ నటి మధుబాల బయోపిక్ వెండితెరపై రాబోతోంది. జీవితం ఆధారంగా, మధుబాల చెల్లెలు మధుర్ బ్రిజ్ భూషణ్ బ్రూయింగ్ థాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. నా ప్రియమైన సోదరి కోసం ఏదైనా చేయాలనేది నా చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసుకోవడానికి నేను, నా సోదరీమణులందరూ
శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారైంది. టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడ్డంతో ఈ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు విధిలేని పరిస్థితుల్లో ఆహారం, మందులు, కుటుంబ పోషణ కోసం వేశ్య వృత్తిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతర ఉద్యోగాలు చేయడానికి నైపుణ్యం లేని కారణంగా పడుపు వృత్తిలో దిగాల్సి వస్తోందని
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ (ERD) ప్రకారం, రైతుల ఆదాయం కొన్ని రాష్ట్రాల్లో (కర్ణాటకలో పత్తి మరియు మహారాష్ట్రలో సోయాబీన్ వంటివి) 1.3–1.7 రెట్లు పెరిగింది మరియు 2018తో పోలిస్తే 20222లో కొన్ని పంటల ఆదాయం రెండు రెట్లు పెరిగింది.
వరుసగా ఎనిమిదో సెషన్లో కరెన్సీ బలహీనపడటం,ముడి చమురు పెరగడంతో మంగళవారం యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి 80 కి చేరుకుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే డాలర్‌తో రూపాయి మారకం విలువ బలంగా ఉన్నప్పుడు వారు అడ్మిషన్లు పొంది అందుకు అనుగుణంగా ఫీజులు
నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్‌లో పాస్వర్డ్ మరియు ఖాతా షేరింగ్‌ని చెల్లింపు పద్ధతిగా చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, వినియోగదారులు దానిని సీరియస్‌గా తీసుకుని ఉండకపోవచ్చు. అందువల్ల, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ఎంచుకున్న దేశాల్లోని ఇతరులతో తమ ఖాతా పాస్‌వర్డ్‌ను షేర్ చేసే వినియోగదారులకు ఛార్జీ విధించడానికి కొత్తగా “ హోమ్ యాడ్ ” ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది.
ఆహారంలో ఎక్కువ ఉప్పు వేసుకునే వారు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఐదు లక్షల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ఎప్పుడూ లేదా అరుదుగా తమ ఆహారంలో ఉప్పు కలపని వారితో పోలిస్తే, క్రమం తప్పకుండా చేసే వారు అకాల మరణానికి గురయ్యే అవకాశం 28 శాతం ఎక్కువ.