Home /Author Jyothi Gummadidala
ప్రపంచంలో ఏదో ఓ మూల రోజూ మరణ వార్తలు వింటూనే ఉన్నాం. అందులోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాని వలసవెళ్లే వారూ ఉంటారు. కాగా తాజాగా సిరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరియా తీరంలో బోటు బోల్తాపడి దానిలోని 77 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతులంతా వలసదారులుగా అధికారులు గుర్తించారు.
దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
టీఎస్ పీఈసెట్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సీహెచ్ గోపాల్ రెడ్డి కలిసి విడుదల చేశారు. టీఎస్ పీఈసెట్‌లో 95.93 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
ఇరాన్లో నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో రోడ్డెక్కారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది మృతి చెందారు.
దగ్గుబాటి స్టార్ హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్‌సిరీస్ "రానా నాయుడు". దీనికి కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రానా, వెంకటేష్ పోస్టర్లు వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు పెంచేశాయి. కాగా ఇటీవల షూటింగా పూర్తిచేసుకున్న ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
కరోనా కంటే డేంజర్ అయిన వైరస్ ఒకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఇప్పుడు గబ్బిలాల నుంచి మానవాళికి సోకుతుందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే స్వభావం ఉన్న ఈ వైరస్‌కు ఖోస్టా-2గా నామకరణం చేశారు.
తమిళంతో పాటు తెలుగునాట మంచి క్రేజ్ ఉన్న హీరో విక్రమ్. ఈ స్టార్ హీరో ముఖ్య పాత్రలో నటించిన ఇటీవల చిత్రం కోబ్రా. ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.
టెన్నిస్ దిగ్గజం, స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ కు వీడ్కోలు పలికారు. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో కలిసి లావెర్ కప్ 2022లో డబుల్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఫెదరర్ కంటితడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావెర్ కప్ 2022తో రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నంలో జరిగిన సంగతి విదితమే. కాగా ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరయస్ అయ్యింది. దీనికి బాధ్యులయిన పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది. మరికొందరిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.
భాగ్యనగరంలో రేపు అనగా సెప్టెంబర్ 25 ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ ఉన్న నేఫథ్యంలో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు.