Home /Author anantharao b
ఎట్టకేలకు అమెథీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాల్లో ఎవరూ పోటీ చేస్తారనే సస్పెన్స్ తెరపడింది. రాహుల్ గాంధీ అమెధీ నుంచి కాకుండా తన తల్లి నియోజకవర్గం అయిన రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనదైన శైలిలో రాహుల్‌గాంధీపై సెటైర్లు విసిరారు. 'డరో మత్, బాగోమత్" అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. తెలంగాణ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు. ఐదు న్యాయాలు-తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. నిన్న ఏపీలో అత్యధికంగా 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లాలోని ఎండ్రపల్లిలో రికార్డ్ స్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మార్కాపురంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఆయన కుమార్తె క్రాంతి షాకిచ్చారు. ముద్రగడను వ్యతిరేకిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు. తన తండ్రి వైఖరిని తాను వ్యతిరేకిస్తున్నానని, పిఠాపురంలో జనసేన గెలుపుకు పాటు పడతానని చెప్పారు.
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి తరచూ ఆశ్చర్యకరమైన విషయాలను వింటుంటాం. అయితే ఈ సారి మాత్రం మరో దిగ్ర్భాంతికరమైన విషయాలను ఉత్తర కొరియా నుంచి తప్పించుకొని వచ్చిన యోన్మి పార్క్ అనే మహిళ బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయాలను బ్రిటిన్‌కు చెందిన మిర్రర్ అనే పత్రిక ప్రచురించింది
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే 400 పై చిలుకు సీట్లు సాధిస్తామనేది ఆయన ధీమా. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ మాత్రం 400 పార్ ఓ పెద్ద జోక్, 300 పార్ అసంభవం.. 200 పార్ అతి పెద్ద చాలెంజ్ అని అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మహిళా రెస్లర్లను లైంగికంగా వేధించాడని ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో క్రీడాకారులంతా ఆయనను అరెస్టు చేయాలని, ఆయన చేతిలో తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రధాని నుంచి హోంమంత్రి వరకు ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేశారు.
జగన్ సిద్ధం అంటూ ఎందుకొస్తున్నాడు? మద్యం ధరలు పెంచినందుకా? ఎందరో మహిళలు కనిపించకుండా పోయారు అందుకా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్ ప్రసంగించారు.
ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు .గడువు ముగిసిన తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర, యదావిధిగా సాగనుంది. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమీషన్ కేసీఆర్ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో సెక్స్ స్కాండల్‌లో కూరుకుపోయిన జెడి ఎస్యుతో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని మాస్ రెపిస్టు కోసం ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. క