Home /Author anantharao b
పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. పంజాబ్‌లోని తన నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి సామాజిక హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాక్షుల తప్పుడు వాంగ్మూలాలను రూపొందించి, అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన నానావతి కమిషన్ ముందు వాటిని ప్రవేశపెట్టారని తీస్తా సెతల్వాద్‌పై ఆరోపణలు ఉన్నాయి.
సెప్టెంబరు 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 20వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ ఉంటుందన్నారు.
విశ్వక్ సేన్ కొత్త చిత్రం దాస్ కా ధమ్కీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్లు టోడర్ లాజరోవ్ మరియు జుజీ ఈ స్టంట్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పూరీ జగన్నాధ్‌కు భారీ షాక్ నిచ్చింది. చిన్న విరామం తరువాత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం హైదరాబాద్‌లో కుషి షూటింగ్లో ఉన్నాడు.
ప్రస్తుతం కొనసాగుతున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొన్ని కీలక ప్రకటనలను విడుదల చేసింది. ఒక నెల విరామం తర్వాత, సెప్టెంబర్ 1 నుండి షూట్లు పూర్తిగా తిరిగి ప్రారంభమయ్యాయి. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు రోజువారీ చెల్లింపులు ఉండవు.
ఆఫ్గనిస్తాన్ హెరాత్‌లోని గుజార్గా మసీదులో శుక్రవారం జరిగిన పేలుడులో 20 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రముఖ మతపెద్ద ముజీబ్-ఉల్ రెహమాన్ అన్సారీ మరణించారు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు పార్ట్ లుగా విడుదల కానుంది.
త్వరలో ఏపిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.