Home /Author anantharao b
కేంద్ర ప్రభుత్వ తీరు పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున ఆయన భార్య ఉషాబాయి మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పంకు రానున్నారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.
మాస్ మహారాజ్ రవితేజ ధమాకా షూటింగ్‌ను పూర్తి చేసారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21వ తేదీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
టాలీవుడ్ అత్యుత్తమ మాస్ దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు. సుదీర్ఘ విరామం తర్వాత, అతను టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం చత్రపతిని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నాడు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన సినిమాలకు ఆకట్టుకునే స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంతో పాటు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నాగార్జున నటించిన ఘోస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్. టీమ్ ఇప్పుడు ద ఘోస్ట్ గన్స్ అండ్ స్వోర్డ్స్ అనే శిక్షణ వీడియోను విడుదల చేసింది.
జింఖానాగ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులపై అజారుద్దీన్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసారు.
మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో తిరుగులేని రారాజుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి నేటితో టాలీవుడ్లో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
2019-20లో 5 కీలక పరిశ్రమల్లో అక్రమ వస్తు వ్యాపారం కారణంగా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో రూ.58,521 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని మసీదును సందర్శించి దాని ప్రధాన మతపెద్దలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన మతగురువు ఉమర్ అహ్మద్ ఇలియాసిని ఢిల్లీ మసీదులో కలిశారు.