Home /Author anantharao b
యశోధ చిత్రం విడుదలకు ముందు సమంతా రూత్ ప్రభు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ శ్రీపాదతో మాట్లాడని కారణంగా ఈ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకుందని పుకార్లు వచ్చాయి.
ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. తొలి సెషన్‌కు హాజరయ్యారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోవియట్ శకం నాటి మదర్ హీరోయిన్ టైటిల్ అవార్డును పునరుద్ధరించారు. పదిమంది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లిని పుతిన్ ఈ అవార్డుతో సత్కరిస్తారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు రష్యా తెలిపింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్ లో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గచ్చిబౌలి స్టేడియం చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు జరుగుతున్న సంస్థల్లో మార్గదర్శి, శ్రీరామ్, కపిల్ చిట్స్ వంటి సంస్థలు ఉన్నాయి.
త్వరలో విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు కానుందా? అందుకోసం సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారా? అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారా? కోర్టుల్లో కేసులు ఉండగా, విశాఖను రాజధాని చేస్తే, ఎదురయ్యే ఇబ్బందులేంటి?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికల ఆలోచన పెట్టుకోవద్దని సీఎం కేసీఆర్ పార్టీనేతలకు చెప్పారు.
నిజాంకాలేజీ హాస్టల్ కొత్త బిల్డింగ్ అంతా తమకే కేటాయించాలంటూ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్దులు చేసిన పోరాటం ఫలించింది. ఇది వారికే కేటాయించాలని ప్రభుత్వం అంగీకరించింది.
2021-22 విద్యా సంవత్సరంలో 200,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ను తమ ఉన్నత విద్యా గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్‌ను కోరారు.