Home /Author anantharao b
:జూలై 2023 వస్తు, సేవల పన్ను (GST) ఆదాయం వసూళ్లు రూ. 165,105 కోట్లు గా ఉన్నాయి. 2022లో అదే నెలలో నమోదైన దానికంటే జూలై లో జీఎస్టీ ఆదాయం 11 శాతం ఎక్కువ.ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం , జూలైలో మొత్తం జీఎస్టీ వసూళ్లలో, సీజీఎస్టీ రూ.29,773 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,623 కోట్లు, ఐజీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,239 కోట్లతో కలిపి) మరియు సెస్సు రూ.11,779 కోట్లు. (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 840 కోట్లతో సహా)
ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు బయపడ్డాయని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ఏపీలో 47 పాయింట్ ఒకటి ఏడు టన్నుల బంగారు నిక్షేపాలున్నాయని ప్రహ్లాద్ జోషి చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ సెటైర్లు వేసారు.
దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జోసా కౌన్సిలింగ్ పూర్తియింది. ఇపుడు CSAB కౌన్సిలింగ్ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి జూలై 31 నుంచి ఆగష్టు 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. CSAB అంటే Central seat allocation board. జోసా కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత మిగిలిన సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఐదు క్రిమినల్ కేసుల్లో క్షమాభిక్ష లభించిందని, అయితే ఆమె ఇంకా 14 కేసులను ఎదుర్కొంటున్నట్లు రాష్ట్ర మీడియా మంగళవారం తెలిపింది. 7,000 మందికి పైగా ఖైదీల క్షమాభిక్షలో భాగంగా ఈ ప్రకటన వెలువడింది.
తనకు ప్రదానం చేసిన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పురస్కారం మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేను బహుమతి డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు.
మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు చర్చ జరగనుంది.ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న సమాధానం ఇవ్వనున్నారు.జూలై 26న ప్రతిపక్ష పార్టీల తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక పౌరుడు మరియు ఒక ఇమామ్‌తో సహా నలుగురు వ్యక్తులు మరణించారు మరియు అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
:చైనా రాజధాని బీజింగ్ చుట్టుపక్కల పర్వత ప్రాంతాలలో వరదల కారణంగా 11 మంది మరణించగా, 27 మంది తప్పిపోయారు.నాల్గవ రోజు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతాలప్రజలను పాఠశాల జిమ్‌లకు తరలించాలని అధికారులు ఆదేశించారు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యల్ని అధికారులు, నేతలు పట్టించుకోవడం లేదని.. 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నాడు. ప్రజల సమస్యలు తీర్చలేనప్పుడు కౌన్సిలర్‌గా ఉండి ఏం లాభమని ఆవేదన వ్యక్తం చేశాడు. మరణించడం తప్ప.. తనకు వేరే మార్గం లేదని కౌన్సిలర్ రామరాజు కంటతడి పెట్టుకున్నాడు.
అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా పేరున్న రెమీ లుసిడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్ సాహసికుడికి ప్రమాదాలతో చెలగాటమాడటం సరదా. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది.