Home /Author anantharao b
విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభలో మంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. ప్రస్తుతం అప్పుల పరిస్థితి చూస్తే.ఆందోళన కరంగా ఉందని తెలిపారు.
రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారని ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిలా్ల పోలేపల్లి వద్ద బుధవారం రాత్రి యువగళం- నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం రాత్రి యువగళం-నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదని అన్నారు.
తాను చేయలేని పాదయాత్ర నారా లోకేష్ చేసినందుకు అభినందనలు తెలుపుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం రాత్రి యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర వలన ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసే అవకాశం లభిస్తుందన్నారు. లోకేష్ యాత్ర జగన్ యాత్ర లాగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని ప్రజలతో మమేకమైన యాత్రని అన్నారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 33 మంది మరణించారు. లెబనాన్ నుండి ఉత్తర ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన ఆరు రాకెట్లను అడ్డుకున్నామని, దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు తన తొలి విమానాన్ని నడుపుతుంది. జనవరి 16 నుండి రోజువారీ విమానసర్వీసులు ప్రారంభమవుతాయి.జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
శవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 యొక్క 21 కేసులు నమోదయ్యాయి. గోవా, కేరళ మరియు మహారాష్ట్రలో కొత్త కరోనావైరస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.గోవాలో ఇప్పటివరకు 19 కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. కేరళ మరియు మహారాష్ట్రలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
పార్లమెంటు ఆవరణలో తృణమూల్ ఎంపీ ఒకరు తనను అనుకరిస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ బుధవారం వెల్లడించారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన మోదీ తాను కూడా గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి అవమానాలను భరించానని చెప్పారని అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆమె ముందుగా పట్టణంలోని ఆచార్య వినోబా భావే భవన్‌కు వెళ్లారు. అక్కడ వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి చిత్రపటాలకు ఆమె నివాళులర్పించారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎన్నారై బృందాలు కలిశాయి. ఆస్ట్రేలియ కన్వీనర్ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్‌కు చెందిన ఎన్నారై జనసేన నేతలు పవన్‌ను కలిశారు.