Last Updated:

CM Chandrababu Naidu: ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక తవ్వకాల్లో అవకాశం

CM Chandrababu Naidu: ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక తవ్వకాల్లో అవకాశం

CM Chandrababu Naidu: ఈ నెల 16 నుంచి అనుమతులున్న రీచ్‌లు అన్నింటిలోనూ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడమే కాకుండా, నేరుగా రీచ్‌కి వెళ్లి తీసుకొనేందుకు అవకాశం కల్పంచాలన్నారు. సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి గనులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.

ఇసుక అత్యవసరమైన వాళ్లు నేరుగా రీచ్‌కి వచ్చి, నగదు చెల్లించి ఇసుకను తీసుకెళ్లే అవకాశం కల్పించాలన్నారు. రాత్రి ఇసుక తవ్వకపోయినా.. సమీప స్టాక్ పాయింట్లలో లోడ్ చేసి రద్దీని తగ్గించాలని తెలిపారు. డీస్టిడీసిల్టేషన్‌ పాయింట్లు, మాన్యువల్‌గా తవ్వే రీచ్‌లు అన్నింటిలోనూ ఇసుక తవ్వకాలు జరపాలన్నారు. ఇలా జరిగితే నిత్యం 70 వేల నుంచి లక్ష టన్నుల వరకు ఇసుకు అందుబాటులో ఉంటుంటుందని, ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చేయచ్చని వెల్లడించారు.

ఈ మేరకు అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు సైతం ఇసుక తవ్వకాల్లో అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. అందుకు సీఎం చంద్రబాబు ఆమో తెలిపారు. నదు్లో ఇసుకు రీచ్‌లను గుర్తించి, అనుమతులున్న వారికే ప్రాధాన్యత వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇవి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించేలా చూడాలని చంద్రబాబు తెలిపారు.

దీనికోసం ఇప్పుడున్న నిబంధనల్లో చేయాల్సిన మార్పులు వేగంగా చేయాలని ఆదేశించారు. ఇసుకు దారి మళ్లించకుండా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలని గుర్తు చేశారు. ఇసుక కొనుగోలుదారుల వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పరిశీలన చేయాలని వెల్లడించారు.

వీలైనంత త్వరగా పరిశ్రమలకు సిలికా శాండ్, క్వార్ట్జ్, మైకా తదితర ఖనిజాల పర్మిట్లు జారీ చేయాలని అన్నారు. లేదంటే మెటిరీయల్ దొరక్క ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని క్వార్ట్జ్, సిలికా శాండ్‌లో గతంలో అక్రమాలు జరిగాయని, ఈసారి అటువంటి లీజుదారులు, మినరల్‌ డీలర్‌ లైసెన్సుదారులు గుర్తించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఆయా ఖనిజాల రవాణా జరిగేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని వెల్లడించారు.