Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి వివాదం నుంచి బయటపడతారని తెలుసా..!
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి వివాదం నుంచి బయటపడతారని తెలుస్తుంది. అలాగే జూలై 10 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆస్తి వివాదం నుంచి బయటపడతారని తెలుస్తుంది. అలాగే జూలై 10 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. వృథా ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. తొందరపాటు వ్యవహారాల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం..
ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయాలకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చుకోగలుగుతారు.
మిథునం..
సంతానానికి సంబంధించి..శుభవార్త వింటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అందివచ్చే అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కర్కాటకం..
అనుకోకుండా మొండి బాకీలు వసూలువుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఆందోళనకర వార్తలు వినాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం మామూలుగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
సింహం..
వృత్తి, వ్యాపారాలలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. వాహన ప్రమాద సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి.
కన్య..
అదనపు ఆర్థిక ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
తుల..
ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయి కొద్దిగా ఊరట చెందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. శత్రువుల లేదా ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం..
కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి లోటు ఉండదు. ప్రయాణాలలో, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మనస్పర్థలు ఏర్పడే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనస్సు..
సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వృత్తిపరంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది.
మకరం..
కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. బంధుమిత్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి బయటపడతారు. కొన్ని బరువు, బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.
కుంభం..
మీ సలహాలు, సూచనలను అధికారులు పాటించి ప్రయోజనం పొందుతారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మీనం..
చాలా కాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. తోబుట్టువులు అన్ని విధాలుగానూ సహకరిస్తారు. ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయిగానే ఉంటారు. మధ్య మధ్య కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. దైవకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.