Last Updated:

Accident: వ్యక్తిని ఢీ కొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడిన బాధితుడు.. సీసీ ఫుటేజ్ వైరల్

Accident: తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నాగోల్ కి చెందిన ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది.

Accident: వ్యక్తిని ఢీ కొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడిన బాధితుడు.. సీసీ ఫుటేజ్ వైరల్

Accident: హైదరాబాద్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం మత్తులో.. అతివేగం వల్ల తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. వారు ప్రమాదాలకు గురవడమే కాకుండా.. ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది.

సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాలు.. (Accident)

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద దృశ్యాలు నెట్టింటా వైరల్ గా మారింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నాగోల్ కి చెందిన ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు పలు విషయాలను వెల్లడించారు.

నాగోల్ పరిధిలోని కుషాయిగూడ సమీపంలోని నాగారంలో నివసించే జైకుమార్‌ అనే వ్యక్తి నాగోలులోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో నాగోలులోని రామాలయం వద్ద నడుస్తూ సంస్థ కార్యాలయం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. కారు ప్రమాదంలో బాధితుడు అమాంతం గాల్లోకి ఎగిరి 20 అడుగుల దూరంలో పడి గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులోని మహిళ సైతం అతని వెంట ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించారు. ప్రాణాపాయం లేదని సమాచారం. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో.. సెల్ ఫోన్ ఉపయోగించరాదని పోలీసులు సూచిస్తున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

 

వాహనాలు నడిపేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.