Published On:

IPL 2025: ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో విజయం

IPL 2025: ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో విజయం

Lucknow Won on Mumbai By 12 Runs: ఐపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో లక్నో గెలుపొందగా.. ఇది లక్నోకు రెండో విజయం. తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

 

లక్నో బ్యాటర్లలో ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్‌క్రమ్ మంచి శుభారంభం అందించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించారు. మిచెల్ మార్ష్(60, 31 బంతుల్లో 2 సిక్స్‌లు, 9 ఫోర్లు), మార్ క్రమ్(53, 38 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆయుష్ బదోనీ(30), డేవిడ్ మిల్లర్(27), రిషబ్ పంత్(2), పూరన్(12), సమద్(4), ఆకాశ్ దీప్(0) విఫలమయ్యారు. చివరిలో ఠాకూర్(5), అవేశ్ ఖాన్(2) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 5 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుతుర్ తలో వికెట్ తీశారు.

 

204 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ముంబైకు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు విల్ జాక్స్(5), రికెల్టన్(10) ఔటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్(46), సూర్యకుమార్(67) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దూకుడుగా ఆడుతున్న నమన్‌.. దిగ్వేష్ బౌలింగ్‌లో పెవిలియన్ చేర్చగా.. సూర్య భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ(25) రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరిలో పాండ్యా(28) కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫలితం దక్కలేదు. లక్నో బౌలర్లలో శార్దూల్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేశ్ తలో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి: