Last Updated:

Maruti Suzuki Dzire: సేఫ్టీలో అదుర్స్.. 5 స్టార్ రేటింగ్ సాధించిన మారుతి డిజైర్.. తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్ ఇదే..!

Maruti Suzuki Dzire: సేఫ్టీలో అదుర్స్.. 5 స్టార్ రేటింగ్ సాధించిన మారుతి డిజైర్.. తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్ ఇదే..!

Maruti Suzuki Dzire: ఇటీవల కాలంలో భారతీయులు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. టాటా, మహీంద్రా వంటి దేశీయ బ్రాండ్లు సురక్షితమైన కార్లను అందించడంలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు మారుతి సుజుకి కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా విడుదల చేసిన మారుతి సుజుకి డిజైర్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన కంపెనీ మొదటి కారుగా అవతరించింది. కారులో ఆకర్షణీయమై ఫీచర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

డిజైర్ అనేది మారుతి సుజుకి మొదటి, ఏకైక కారు, క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ ప్రారంభ ధర రూ.6.79 లక్షల ఎక్స్-షోరూమ్ ఇండియా. అలాగే, టాప్ వేరియంట్ ధర రూ.10.19 లక్షల ఎక్స్-షోరూమ్. మారుతి సుజుకి డిజైర్ పెద్దల రక్షణ కోసం 5 స్టార్, పిల్లల కోసం 4 స్టార్‌ను స్కోర్ చేసింది. ప్రత్యేకించి, డిజైర్ వయోజన ప్రయాణీకుల రక్షణ పరీక్షలో 34 పాయింట్లకు 31.24, పిల్లల ప్రయాణీకుల రక్షణ పరీక్షలో 42 పాయింట్లకు 39.20 స్కోర్ చేసింది.

ఈ డిజైర్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX మౌంట్‌లు వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది. మొత్తంమీద, ఈ అన్ని భద్రతా ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీతో డిజైర్ ఖచ్చితమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.

కొత్త డిజైర్‌లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, ఆటో ఏసీ, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఈ కారులో సన్‌రూఫ్ (సింగిల్ ప్యానెల్) కూడా అందించారు.

కొత్త డిజైర్ 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 82 పిఎస్ పవర్, 112 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఆప్షనల్ CNG పవర్ కూడా అందుబాటులో ఉంది. ఇంజన్ 70 పిఎస్ పవర్, 102 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కంపెనీ ప్రకారం.. డిజైర్ పెట్రోల్ MTలో 24.79 kmpl, పెట్రోల్ AMTలో 25.71 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది CNGలో కిలోకు 33.73 కిమీ మైలేజీని ఇస్తుంది. 2024 మారుతి డిజైర్ కొత్త తరం హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్‌లతో పోటీపడుతుంది.