CM Cup 2024: నేటి నుంచి సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలు
CM Cup 2024 State level competitions start from today: తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ 2024కు సంబంధించిన రాష్ట్రస్థాయి పోటీలు నేటి నుంచి జనవరి 2వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్యర్యంలో పోటీలకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థాయి, మండల, జిల్లా స్థాయి పోటీలు పూర్తి కాగా.. నేటి నుంచి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయి.
ఈ పోటీల్లో భాగంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సంక్షిప్తం చేశారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. మరోవైపు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.