Home / ts latest news
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శలు సంధించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం మరిచిందని అన్నారు
Harish Rao: నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు.
Naveen Murder: పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సంఘటన స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. సాయంత్రం మరోసారి బయటకు తీసుకువెళ్లారు. మలక్‌పేటలోని సలీంనగర్ లోని ఓ అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లారు.
Bandi Sanjay: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని విమర్శించారు. భాజపా దయ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
CM KCR Comments: బాన్సువాడ నియోజకవర్గానికి మరో రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని కేసీఆర్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు.
Suicide: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ అనే విద్యార్ధి.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలించేందుకు.. కాలేజీ సిబ్బందిని సాయం కోరగా పట్టించుకోలేదని విద్యార్ధులు ఆరోపించారు.
TSPSC Group 2: రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్- 2 పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆగస్టు చివర్లో.. అనగా 29, 30 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి.. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చిని అధికారులు తెలిపారు.
Bandi Sanjay: దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లో బండి సంజయ్, తెలంగాణ భాజపా నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో భాజపా భవిష్యత్ కార్యాచరణ.. రాబోయే ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై చర్చించారు.
GHMC: సంచలనం రేపిన వీధి కుక్కల దాడి ఘటనలో బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ నష్టపరిహారం అందించనుంది. మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ నుంచి రూ.8లక్షలు కాగా.. కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షల ఆర్ధిక సాయన్ని అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
Lovers Suicide: వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో చెప్పడానికి భయపడ్డారు. చెబితే ఏం చేస్తారో అన్న భయం వారిని వెంటాడింది. అలా అని.. ఇంకొకరిని చేసుకొవడానికి సిద్ధంగా లేరు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలియడంతో.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.