Home / tollywood
బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రెస్ గా చెప్పవచ్చు. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చెయ్యడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌కి సైన్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నందున ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వినపడలేదు. ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం దర్శకుడు ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం.
తన తొలి చిత్రం ఉప్పెనతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న కృతి శెట్టి ’ది వారియర్‘ మరియు ’మాచర్ల నియోజకవర్గం‘ తో ప్లాప్ లు చూసింది. కొత్త ప్రాజెక్ట్‌కి ఆమె సంతకం చేసింది. ఆమె యంగ్ హీరో శర్వానంద్‌కి జోడీగా కనిపించబోతోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన `గాలోడు` సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నవంబర్ 18న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. గాలోడు సినిమా మంచి విజయం సాధించడంతో మంగళవారం నాడు ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర బృందం.
టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజు పురస్కరించుకుని వారి సూపర్ హిట్ చిత్రాలను మరోసారి రిలీజ్ చేస్తుండగా.. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే డిసెంబర్ 12న సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘బాబా’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్లలు దాటిన అభిమానం ఎన్టీఆర్ సొంతం. కాగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది. కళ్లజోడు పెట్టుకొని ఎంతో స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తున్నారు ఎన్టీఆర్.
నాగచైతన్య హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ #NC22 ఈ మూవీని వెంకట్ ప్రభు రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు #NC22 పేరిట రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్ ను రివీల్ చేశారు చిత్ర బృందం.
90వ దశకంలో వచ్చిన ప్రేమదేశం సినిమా గురించి తెలియని వారుండరు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్నాడు. కాగా తాజాగా ఆయన సంబంధించిన హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులు అబ్బాస్ కు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలనాటి క్లాసిక్ చిత్రాలకు ఇప్పుడు అరుదైన గౌరవం లభిస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’. ఈ మూవీకి గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవం దక్కింది.
మళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’.