Home / Photo Gallery
జాతిరత్నాలు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై చిట్టి అనే పేరుతో ప్రేక్షుకులకు ఎంతగానో దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.'నక్షత్ర' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది ఈ హైదరాబాదీ ముద్ధుగుమ్మ.
అందాలరాక్షసి సినిమాతో అరంగేట్రం చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించారు. సోగ్గాడే చిన్నినాయనా, భలేభలే మగాడివోయ్, చావుకబులు చల్లగా లాంటి సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. అయోధ్యలో పుట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళం, హిందీభాషల్లో పలు సినిమాల్లో నటించారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో హాలోవీన్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను క్రైస్తవులు వారి పూర్వీకులను స్మరించుకుంటూ జరుపుకుంటారు. హాలోవీన్ సందర్భంగా భయానక దుస్తులు ధరించడం, గుమ్మడికాయలు చెక్కడం, భయానక కథలు చెప్పడం, భయానక చలనచిత్రాలు చూడటం మరియు అనేక కార్యకలాపాలు చేస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల చనిపోయినవారు తమను గుర్తుపట్టకుండా ఉంటారని వారు విశ్వసిస్తారు. నిజానికి హలోవిన్ సంహైన్ యొక్క పురాతన సెల్టిక్ పండుగ. హాలోవీన్‌ను పంట కాలం ముగింపుగా జరుపుకుంటారు. మరియు సెల్టిక్ క్యాలెండర్ ప్రకారం, వారి సంవత్సరంలో మొదటి రోజు నవంబర్ 1దానికి గుర్తుగా మనం జనవరి 1నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటామో వారు హలోవిన్ ను అలా జరుపుకుంటారు.
1973 నవంబరు 1 కర్ణాటకలోని మంగళూరులో ఐశ్వర్యారాయ్ జన్మించారు. 1994వ సంవత్సరంలో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు) తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. జీన్స్ (1998) సినిమాతో తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలలో మొదటి హిట్ అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐష్. 20 ఏప్రిల్ 2007న బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ కుమారు అయిన అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 2లో మెరిసిన బుల్లితెర భామ భానుశ్రీ. డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీటాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది భాను. తాజాగా హాట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. తాజాగా భానుశ్రీ షేర్ చేసిన ఫోటోలు మీకోసం
టాలీవుడ్ బ్యూటీ స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. ఈ బ్యూటీ 1981 అక్టోబరు 12న ముంబైలో జన్మించారు. ఈమె గోపిచంద్ హీరోగా నటించిన "తొలివలపు" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తరుణ్ సరసన "ప్రియమైన నీకు" చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సంక్రాంతి, వెంకీ, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ అందాల తార తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వారసుడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషాల్లో విడుదల చేయనున్నారు చిత్ర బృందం. విజయ్ 66వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా వారసుడు చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 12, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ఈషా రెబ్బ తెలుగు నటి. ఈ అందాల తార అంతకు ముందు... ఆ తరువాత... చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైనది. ఈషా ఏప్రిల్ 19న జన్మించారు. హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఎం.బి.ఏ చదివారు. ఫేస్బుక్లో ఆమే ఫొటోలు చూసి ఇంద్రగంటి మోహన కృష్ణ ఆమెను నటిగా పరిచయం చేశారు. అ, అరవింద సమేత, బ్రాండ్ బాబు, తదితరల సినిమాలలో ఈమె నటించారు. దాదాపు 10ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది ఈ అందాల భామ.
అదా కేరళలోని పాలక్కాడ్ లోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కానీ మహారాష్ట్రలోని ముంబైలో పెరిగింది. 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఆమె తెలుగులో నటించిన హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం సినిమాలు విజయం సాధించాయి.
ఎలిజబెత్ II (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ) 21 ఏప్రిల్ 1926 జన్మించి 8 సెప్టెంబర్ 2022 తుది శ్వాస విడిచారు. ఎలిజబెత్-2 6 ఫిబ్రవరి 1952 తన పాతికేళ్ల వయస్సులో పట్టాభిషేకం పొంది బ్రిటన్ రాణిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక అప్పటి నుంచి 8 సెప్టెంబర్ 2022న వరకు యునైటెడ్ కింగ్డమ్ & 14 కామన్వెల్త్ రాజ్యాలకు ఆమె రాణిగా ఉన్నారు. బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యధిక కాలం 70 ఏండ్లు పాలించిన రాణిగా 2015లో ఆమె చరిత్ర సృష్టించారు.