Halloween: హలోవిన్ పండుగ చిత్రాలు చెప్పే కథ
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో హాలోవీన్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను క్రైస్తవులు వారి పూర్వీకులను స్మరించుకుంటూ జరుపుకుంటారు. హాలోవీన్ సందర్భంగా భయానక దుస్తులు ధరించడం, గుమ్మడికాయలు చెక్కడం, భయానక కథలు చెప్పడం, భయానక చలనచిత్రాలు చూడటం మరియు అనేక కార్యకలాపాలు చేస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల చనిపోయినవారు తమను గుర్తుపట్టకుండా ఉంటారని వారు విశ్వసిస్తారు. నిజానికి హలోవిన్ సంహైన్ యొక్క పురాతన సెల్టిక్ పండుగ. హాలోవీన్ను పంట కాలం ముగింపుగా జరుపుకుంటారు. మరియు సెల్టిక్ క్యాలెండర్ ప్రకారం, వారి సంవత్సరంలో మొదటి రోజు నవంబర్ 1దానికి గుర్తుగా మనం జనవరి 1నూతన సంవత్సరంగా ఎలా జరుపుకుంటామో వారు హలోవిన్ ను అలా జరుపుకుంటారు.

క్రైస్తవులు వారి పూర్వీకులను స్మరిస్తూ హలోవిన్ పండుగను జరుపుకుంటారు

పగతీర్చుకోవాలనుకుంటున్న ఆత్మలు గుర్తుపట్టకుండా చిత్ర విచిత్ర వేషధారణలు చేస్తారు

గుమ్మడిగాయలను చెక్కడం, మంత్రగత్తెలు, భయానక చిత్రాలతోనే ఈ పండుగను జరుపుకుంటారు

చిన్నారులకు సైతం భయానక దుస్తులు ధరింపజేస్తారు

అందరూ కలిసి వీధుల్లో భయానక గెటప్స్ వేసి మార్చ్ చేస్తారు

హలోవిన్ పంప్ కిన్స్ చాలా ప్రసిద్ధి

సెల్టిక్ లు వారి న్యూయర్ గా హలోవిన్ జరుపుకుంటారు