Home / national news
Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురెదురుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గంగలూరు పరిధి ఆండ్రి అడవుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టుు మరణించగా.. ఓ జవాన్ కూడ […]
CM Chandrababu Meeting With Bill Gates: ఏపీ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్ గేట్స్ పోస్టు చేశారు. రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్యంలో పాటు వ్యవసాయం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. కాగా, అంతకుముందు రోజు ఢిల్లీలో బిల్ గేట్స్ తో ఏపీ సీఎం […]
Election Commission : ఈసీ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్‌తో ఓటర్ కార్డు అనుసంధానం ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. మంగళవారం పలుశాఖల ముఖ్య కార్యదర్శులతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను అత్యంత వేగంగా జరపాలని నిర్ణయించింది. దీంతో దొంగ ఓట్లను పూర్తిగా నివారించొచ్చని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఆధార్ కార్డుతోపాటు ఓటరు ఐడీ అనుసంధానం అయితేనే ఓటింగ్‌కు […]
Rajnath Singh : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో అగ్రరాజ్యం అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు. సౌత్‌బ్లాక్‌లో ఈ మీటింగ్ జరిగింది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం కూడా చర్చల అజెండాలో ఉంది. ఓ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్‌లో రెండున్నర రోజుల పర్యటనకు తులసీ న్యూఢిల్లీకి వచ్చారు. గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్‌లో […]
PM Modi To Inaugurate Raisina Dialogue: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘రైసినా డైలాగ్’ సదస్సు నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా, ఈ రైసినా డైలాగ్ సదస్సు ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా మారనుంది. […]
Karnataka : దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. దీంతో యువత డ్రగ్స్‌కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కొందరు డబ్బుల ఆశకు డ్రగ్స్ వ్యాపారానికి పాల్పపడుతున్నారు. దేశంలో ఎక్కడో ఓ చోట రోజు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా భారీగా డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ మేరకు డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు […]
Uttar Pradesh : ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. కొన్ని రోజులుగా ప్రియుడు, ప్రియురాలు ఇద్దరు కలిసి సహజీవనం చేశారు. ప్రియుడు ప్రియురాలికి ఈ క్రమంలోనే నగదు, బంగారం కొనిచ్చేశాడు. ఇంతలోనే ఆమె వేరే వ్యక్తితో పరిచయం చేసుకొని ప్రియుడికి నమ్మించి మోసం చేసింది. ఈ ఘటన యూపీలోని మహోబా జిల్లాలో చోటుచేసుకుంది. సహజీవనం సమయంలో ఇచ్చిన డబ్బులు, బంగారం తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ప్రియుడు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే […]
India-Pakistan : ఇండియా పొరుగు దేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ న్యూఢిల్లీపై మరోసారి నోరు పారేసుకుంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు. పాక్ ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులుగా తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. […]
CM Revanth Reddy : తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని, ప్రతిఒక్కరికీ ఫొటోలు దిగి చూపించాల్సిస అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో నియోజకవర్గాల డీమిలిటేషన్, త్రిభాషా అంశాలపై ఆయన తమిళ మంత్రి కేన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే నేతతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్‌హౌజ్‌కే పరిమితం అవుతున్నారని కామెంట్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ […]
Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్‌ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్‌కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబల్‌ను చేర్చినట్లు పేర్కొంది. రాష్ట్ర భాషకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రూపీ సింబల్(₹) స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరాన్ని డీఎంకే ప్రభుత్వం చేర్చింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. విద్యా విధానంలో […]