Home / national news
Indian Railways : ట్రైన్లో అందించే ఆహారం నాసిరకంగా ఉందని, టాయిలెట్లు అశుభ్రంగా ఉన్నాయని, రైళ్లు ఆలస్యంగా వచ్చిందని ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తుండటం మనం చూస్తూ ఉంటాం. కానీ, ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. సౌత్ బిహార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఏసీ కోచ్‌లో ఉన్న ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి తన బెర్త్ వద్ద ఎలుకలు తిరగటాన్ని గమనించాడు. అనంతరం రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటన […]
Ranya Rao : దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడిన నటి రన్యారావు కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. నటి పెళ్లి వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దిగిన ఫొటో లీక్ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సిద్ధిరామయ్య ఇంటి వరకు.. రన్యారావు స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన సమస్య ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి వరకు వచ్చింది. […]
PM Modi says Mauritius is Family: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, గ్లోబల్ సౌత్‌కు మధ్య మారిషస్ ఒక వారధి అని వెల్లడించారు. మారిషస్ అనేది భాగస్వామ్య దేశం మాత్రమే కాదన్నారు. భారతదేశ కుటుంబంలో మారిషస్ ఓ భాగమని, మినీ ఇండియా అని మోదీ అభివర్ణించారు. […]
Prime Minister Narendra Modi to Visit Mauritius: ప్రధాని నరేంద్ర మోదీ మిత్రదేశం మారిషస్‌కు బయలుదేరారు. ఈ మేరకు ఆ దేశంలో రెండు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు. అలాగే మార్చి 12న జరగనున్న మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం ఆహ్వానమేరకు ప్రధాని మోదీ మారిషస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాంను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు […]
Atishi : గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ తెలిపారు. కాంగ్రెస్పాటు ఎవరితోనూ పొత్తులపై ఇంకా చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఇవాళ గోవాలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటి వరకు చర్చించలేని స్పష్టం చేశారు. 2022లో […]
Lok Sabha : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీలకు గతంలో ఇచ్చిన కోటాను పునరుద్ధరించే అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. లోక్‌సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్‌లో రద్దు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగం చేస్తూ బదిలీ అయిన […]
Ranya Rao : నటి రన్యారావు డీఆర్ఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఎదుట ఆమె బోరున విలపించారు. కస్టడీలో తనను శారీరకంగా హింసించారా లేదా అని కోర్టు ప్రశ్నించగా, నటి రన్యారావు భావోద్వేగానికి గురయ్యారు. తనను మానసికంగా హింసించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నటి మాట్లాడారు. తనను మాటలతో హింసించి, బెదిరించారన్నారు. చాలా భయపడిపోయాయని, మానసికంగా కుంగిపోయానని ఆమె కోర్టులో చెప్పారు. డీఆర్ఐ మాత్రం ఆమె ఆరోపణలను […]
ISRO : అస్సాం సర్కారు రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇస్రోతో చర్చలు మొదలు పెట్టినట్లు తెలిపింది. రాష్ట్ర సరిహద్దులపై నిఘా ఏర్పాటు కోసం దోహదం చేస్తుందని తెలిపింది. సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కూడా ఉపయోగపడుతుందని వెల్లడించింది. దేశంలోనే సొంత ఉపగ్రహం కలిగిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలువనుంది. రాష్ట్రం కోసం.. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ […]
Rahul Gandhi demands discussion on voter list in Lok Sabha: ఓటర్ల జాబితాపై దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో కేంద్రంపై విమర్శలు చేశారు. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరగాలని కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాగా, పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. వక్ఫ్ బోర్డు, సవరణ చట్టం, కొత్త విద్యావిధానం, భారత్‌పై ట్రంప్ సుంకాలు వంటి […]
Bomb Threats to Air India Flight: అలర్ట్. మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని టేకాఫ్ అయిన వెంటనే అక్కడే దింపారు. వివరాల ప్రకారం.. బోయింగ్ 777 ఎయిరిండియా విమానం ముంబై నుంచి న్యూయార్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయి సుమారు 4 గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అజర్ […]