Home / movie news
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ శుక్రవారం ఉదయం చెన్నైలో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ఈ నటుడు చెన్నైలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో, అతను 100 చిత్రాలలో నటించి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతాప్ ఆగస్టు 1952లో జన్మించాడు. ముంబై యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి పేర్లు ప్రస్తావించకుండా వీరు వున్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతుందని అన్నాడు. ఈ కింగ్, బాద్షా మరియు సుల్తాన్లు బాలీవుడ్లో ఉన్నంత కాలం హిందీ సినిమా మునిగిపోతుంది. మీరు ప్రజల కథల సహాయంతో ప్రజల పరిశ్రమగా చేస్తే,
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి ఛైర్మన్ లలిత్ మోడీ, నటి సుస్మితా సేన్‌తో తన సంబంధాన్ని గురువారం రాత్రి సోషల్ మీడియా అధికారికంగా ప్రకటించారు. మాజీ అందాల భామతో కలిసి దిగిన చిత్రాలను ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతను తన ట్వీట్లో సుస్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్" అని పేర్కొన్నాడు తాము వివాహం చేసుకోలేదని మరియు వారు "కేవలం డేటింగ్" అని
హీరో నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గంలో చిత్రంలో సముద్రఖని రాజప్ప అనే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సినిమాలోని అతని లుక్‌ని గురువారం విడుదల చేసారు.సముద్రఖని ఎవరివైపో సీరియస్‌గా చూస్తూ పేపర్‌పై సంతకం చేస్తూ కనిపించాడు. అతని గెటప్ సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, లుక్స్ భయపెడుతున్నట్లు వున్నాయి.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' ఈ ఏడాది విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. 'ది కాశ్మీర్ ఫైల్స్' సోషల్ మీడియా మరియు టీవీ డిబేట్లలో టాపిక్ అయింది . దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఒక రేంజ్ లో పెరిగాయి.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి తన అభిమానులను షాక్‌కు గురి చేసింది. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన తదుపరి చిత్రం 'ఎమర్జెన్సీ' ఫస్ట్ లుక్ టీజర్‌ను షేర్ చేసింది. ఇందులో బాలీవుడ్ నటి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. ప్రోమోలో, కంగనా ఇందిరా గాంధీ వేషధారణలో కళ్ళజోడు మరియు కాటన్ చీర ధరించి కనిపించింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు బాలీవుడ్‌లోనూ బాగా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా స్టార్ కిడ్స్, యంగ్ హీరోయిన్లు విజయ్ కోసం పోటీ పడుతుండటం విశేషం. అమ్మాయిలే కాదు, స్టార్ హీరోయిన్లు కూడా విజయ్ అంటే ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ 'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్ దేవరకొండ అంటే తమకు క్రష్ అని బాహాటంగానే చెప్పేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న మరణించాడు. అతని మరణానికి సంబంధించిన డ్రగ్స్ కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) విచారణ జరుపుతోంది, దివంగత నటుడి ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితాని మాదకద్రవ్యాల అలవాటును ప్రోత్సహించినట్లు ఎన్‌సిబి తన రిపోర్టులో పేర్కొంది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్, మిరాండా
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. గత వారం తన చిత్రం ‘రంగమార్తాండ’ను ప్రకటించాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతారకు తమిళనాడు అంతటా విపరీతమైన అభిమానం ఉంది ఆమె తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా చేయాలని నిర్ణయించుకుంది. నయన్ 75వ చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. లేడీ సూపర్ స్టార్ 75 అని తాత్కాలికంగా పిలవబడే ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మిస్తుంది. స్పెషల్ వీడియో టీజర్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.