Home / Madhya Pradesh
సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.
మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పోస్ట్‌పై ప్రియాంక గాంధీ వాద్రా, ఎంపీ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్‌లతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతల 'X' ఖాతాల 'హ్యాండ్లర్ల'పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇండోర్ పోలీసులు శనివారం తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తన భార్య పెర్ఫ్యూమ్ కొట్టుకుని బయటికి వెళుతుండగా గొడవపడి ఓ వ్యక్తి కాల్చిచంపాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం మరియు ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు నిందితులలో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు. బాధితురాలి బంధువులు మరియు స్థానికులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. దీనితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై ఇండోర్ పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్రప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు చేసారు.స్థానిక న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఒక వ్యక్తి మూత్ర విసర్జన బాధితుడయిన గిరిజన కూలీ దశమత్ రావత్ ని కలిశారు. తన అధికారిక నివాసంలో అతడి పాదాలను కడిగారు.సిద్ధి జిల్లాలో కార్మికుడిపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లానుబుధవారం అరెస్ట్ చేసి అతడి ఆస్తిని బుల్డోజర్ తో కూల్చేసిన విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపైమాట్లాడుతూ, వ్యక్తి యొక్క చర్య హేయమైనది, ఖండించదగినది మరియు మానవత్వానికి అవమానం అని పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వాళ్లకే గ్యాంరటీ లేని వారు కొత్త కొత్త గ్యారంటీలతో పాటు కొత్త స్కీంలతో హామీలను ఇస్తున్నారని మోదీ అన్నారు.
మద్యప్రదేశ్ లో 220 నెలల భారతీయ జనతా పార్టీ పాలనలో 225 స్కామ్‌లు జరిగాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.సోమవారం మధ్యప్రదేశ్‌లో ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని జబల్పూర్లో ర్యాలీతో ఆమె ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించి నర్మదా పూజలు చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఉన్నారు.కర్ణాటకలో అద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమైంది.