Home / International News
అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం నాడు కురిసిన కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పౌరులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అమెరికాలో హెచ్1బీ వీసాలపై వెళ్లి ఉద్యోగాలు కోల్పోయిన వారికి భారీ ఊరట లభించింది. ఈ వీసాలపై ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా తిరిగి మాతృ దేశానికి రావాల్సి ఉంటుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఈ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచింది.
Meta Layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. గత నవంబర్ లో తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరో 10 వేల మంది ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపధ్యంలో ప్రపంచ ఆహార ధరలను తగ్గించడంలో సహాయపడిన ధాన్యం ఎగుమతి ఒప్పందానికి పొడిగింపును అంగీకరించడానికి మాస్కో సిద్ధంగా ఉందని రష్యా ప్రతినిధి బృందం సోమవారం తెలిపింది. కానీ ఇది కేవలం 60 రోజులకు మాత్రమే అని పేర్కొంది.
:ప్రముఖ వజ్రాల వ్యాపారి నీవర్మోదీ బ్రిటన్‌లో కోర్టు ఫీజులు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదంటూ వాపోతున్నాడు. భారత చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో పిటిషన్ వేశాయి.
సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలను పునఃప్రారంభించేందుకు, ఇరు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఏడేళ్ల ఉద్రిక్తతల తర్వాత, చైనా సహాయంతో ఇరు దేశాలు ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామ్ చంద్ర పాడెల్ ఎన్నికయ్యారు. అతను 33 వేల 8 వందల 2 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, అతని ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబ్వాంగ్ కు 15 వేల 5 వందల 18 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు నేపాల్ ఎన్నికల సంఘం తెలిపింది.
తూర్పుకాంగోలో మిత్రరాజ్యాల డెమోక్రటిక్ ఫోర్సెస్ మిలిటెంట్లు జరిపినజంట దాడుల్లో 40 మందికి పైగా పౌరులు హతమయ్యారని స్థానిక అధికారులు గురువారం తెలిపారు.
:చైనీస్ దౌత్యవేత్తలు తమ దేశాన్ని రక్షించుకోవడానికి తోడేళ్ళతో డ్యాన్స్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వ్యాఖ్యానించారు. తన తొలి వార్షిక మీడియా సమావేశంలో విదేశాంగ విధానం మరియు యుఎస్-చైనా సంబంధాల గురించి ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
లాట్వియా ఈ సంవత్సరం బాగా తాగి నడిపిన డ్రైవర్ల నుండి కార్లను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఇలా స్వాధీనం చేసుకున్నవందలాది వాహనాలతో స్దలాలు నిండిపోవడంతో వాటిని ఉక్రేనియన్ మిలిటరీ మరియు ఆసుపత్రులకు పంపాలని నిర్ణయించుకుంది.